పటౌడీ ప్రసంగంలో ఐదు రోజుల టెస్టు క్రికెట్‌ను పిల్లల డైపర్‌తో పోల్చిన సెహ్వాగ్

హైదరాబాద్: ఐదు రోజుల టెస్టు క్రికెట్‌ను టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చిన్నపిల్లలు వేసుకునే డైపర్‌తో పోల్చాడు. ఈ రెండింటినీ పూర్తి అయిన తర్వాత మాత్రమే మార్చాలంటూ ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనపై సెహ్వాగ్ తేల్చి చెప్పాడు.

ఆదివారం రాత్రి బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో భాగంగా ఏడవ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ఉపన్యాసంలో భాగంగా సెహ్వాగ్ మార్పుకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని... అయితే, ఐదు రోజుల టెస్టు క్రికెట్ అనేది ఒక 'రొమాన్స్' అని అంగీకరించాడు.

డెత్ ఓవర్లను బలోపేతం చేసేందుకు: నాలుగేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి డ్వేన్ బ్రావో

సెహ్వాగ్ మాట్లాడుతూ

సెహ్వాగ్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ "మార్పుకు నేనెప్పుడూ మద్దతిస్తా. నేను తొలి భారత్‌ ఆడిన టి20 గేమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాను. 2007లో భారత క్రికెట్ జట్టు వరల్డ్ టీ20 విజేతగా నిలిచిన జట్టులో నేను కూడా ఉన్నాను. కానీ ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ అనేది రొమాన్స్ లాంటింది" అని అన్నాడు.

డైపర్, ఐదు రోజుల టెస్టులు

డైపర్, ఐదు రోజుల టెస్టులు

"టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు గాను జెర్సీలలో పేర్లు, పింక్ బాల్ టెస్టుల వంటి ఆవిష్కరణలు బాగున్నాయి. డైపర్, ఐదు రోజుల టెస్టులు పూర్తైనప్పుడు మాత్రమే మార్చబడతాయి. అది ఇకపై ఉపయోగించబడదు. ఐదు రోజుల టెస్ట్ పూర్తి కాలేదు. టెస్ట్ క్రికెట్ అనేది 143 ఏళ్ల ఫిట్ పర్సన్. దీనికి ఒక ఆత్మ ఉంది.(నాలుగు రోజుల చందమామ బాగుంటుంది, టెస్టు క్రికెట్ కాదు)" అని సెహ్వాగ్ తెలిపాడు.

ఐసీసీ ప్రతిపాదనపై విరాట్ కోహ్లీ ఇలా

ఐసీసీ ప్రతిపాదనపై విరాట్ కోహ్లీ ఇలా

"నాలుగు రోజుల టెస్టులంటే నాకు నచ్చదు. అది సరైన నిర్ణయం కాదు. వాటిని భవిష్యత్‌లో మూడు రోజులకు కూడా మార్చొచ్చు, తర్వాత అసలు టెస్టు క్రికెట్‌నే తీసేయొచ్చు. ఇలాంటివి నేను ఒప్పుకోను. అంతర్జాతీయ స్థాయిలో ఐదు రోజుల మ్యాచే అసలైన టెస్టు క్రికెట్‌" అని అన్నాడు.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

"ఈ విషయంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు. దీని గురించి ఆలోచించాలి" అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు.

నాలుగు రోజుల ప్రతిపాదన ఎందుకు?

నాలుగు రోజుల ప్రతిపాదన ఎందుకు?

టీ20లు వచ్చిన తర్వాత టెస్టు క్రికెట్‌ వీక్షించే వారి సంఖ్య భాగా తగ్గింది. అందుకు నిదర్శనం 2018లో నమోదైన టీవీ గణంకాలే. 2018లో టీమిండియా 14 టెస్టులాడగా 2.11 కోట్ల మంది టీవీల్లో వీక్షించారు. అదే ఏడాది 20 వన్డేలాడితే 3.67 కోట్ల మంది తిలకించారు. ఇక, 19 టీ20లను చూసిన వారి సంఖ్య 4.46 కోట్ల మంది. ద్వైపాక్షిక సిరీస్‌లు ఏర్పాటు చేసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లేకపోవడంతో ప్రసారదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని టెస్టులు అయితే మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. దీంతో చివరి రెండు రోజుల ఆదాయం గండికొట్టుకుపోతుంది. దీంతో ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, January 13, 2020, 13:18 [IST]
Other articles published on Jan 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X