న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సస్పెండ్‌కే మెగ్గు: పాండ్యా, రాహుల్‌పై బీసీసీఐ లీగల్ సెల్ ఏం చెప్పింది!

Diana Edulji Says Suspend Hardik Pandya, KL Rahul Till Further Action | Oneindia Telugu
Diana Edulji: Suspend Hardik Pandya, KL Rahul till further action

హైదరాబాద్: తదుపరి చర్యలు తీసుకునే వరకు టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లను సస్పెండ్ చేయడమే మంచిదని బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ అన్నారు. 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షోలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరినీ రెండు వన్డేల పాటు నిషేధించాలని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

<strong>ధోనితో ఓ బామ్మ: సోషల్ మీడియాలో వీడియో వైరల్</strong>ధోనితో ఓ బామ్మ: సోషల్ మీడియాలో వీడియో వైరల్

అయితే, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం వేటు వేసే ముందు బీసీసీఐ లీగల్ సెల్ సలహా తీసుకుందామని అన్నారు. అయితే, శుక్రవారం ఆ ఇద్దరు ఆటగాళ్లను సస్పెండ్ చేయవచ్చని బీసీసీఐ పాలకుల కమిటీకి బీసీసీఐ లీగల్ సెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆమె కూడా తన నిర్ణయాన్ని వెల్లడించారు.

ఆటగాళ్ల ప్రవర్తన సరిగా లేదని తెలిసినపుడు

ఆటగాళ్ల ప్రవర్తన సరిగా లేదని తెలిసినపుడు

"ఆటగాళ్ల ప్రవర్తన సరిగా లేదని తెలిసినపుడు వాళ్లను తదుపరి చర్యలు తీసుకునే వరకు సస్పెండ్ చేయడం మంచిది. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినపుడు కూడా ఇలాగే చేశాం. ఈ అంశంపై బీసీసీఐ లీగల్ సెల్ అభిప్రాయం, తుది ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఈ విషయాన్ని ఆటగాళ్లు, జట్టుకు వెంటనే చేరవేయాలి" అని డయానా అన్నారు

వన్డేల పాటు నిషేధం విధించడం ఖాయమే

వన్డేల పాటు నిషేధం విధించడం ఖాయమే

దీంతో పాండ్యా, కేఎల్ రాహుల్‌లపై రెండు వన్డేల పాటు నిషేధం విధించడం దాదాపుగా ఖాయమైనట్లే. మహిళల పట్ల పాండ్యా, రాహుల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు బీసీసీఐ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి రాదని, అయితే సస్పెన్షన్ నిర్ణయం సీఓఏ తీసుకోవచ్చని బీసీసీఐ లీగల్ సెల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

లీగల్ సెల్ ఏం చెప్పిందంటే!

లీగల్ సెల్ ఏం చెప్పిందంటే!

బీసీసీఐ రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలను పరిశీలించిన లీగల్ సెల్ ఈ ఇద్దరు ప్లేయర్స్‌ను సీఓఏ సస్పెండ్ చేయవచ్చు అని స్పష్టం చేసింది. సీఓఏకు ఈ విషయంలో ఉన్న అధికారాలను కూడా పేర్కొంది. అంతేకాదు ఈ వ్యవహారం బీసీసీఐ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి కూడా రాదని లీగల్ సెల్ చెప్పింది.

టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

దీని ప్రకారం మైదానంలో జరిగిన తప్పిదాలతోపాటు మైదానం బయట కూడా మ్యాచ్ లేదా ఆటగాళ్లు, జట్టు, సపోర్ట్ స్టాఫ్‌కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాత్రమే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి వస్తుంది. అయితే రాహుల్, పాండ్యా కేసు వేరని... వాళ్లు ఓ టాక్ షోకు వెళ్లి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంది.

Story first published: Friday, January 11, 2019, 16:05 [IST]
Other articles published on Jan 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X