Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రంజీ: బ్యాటింగ్‌తో ఢిల్లీ స్కోరును వందలు దాటిస్తున్న ధ్రువ్

Dhruv Shorey hundred shores up Delhi against Vidarbha

హైదరాబాద్: రంజీ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా జరుగుతున్న మ్యాచ్‌లో ధ్రువ్ ష్రో సెంచరీ కొట్టి ఢిల్లీ స్కోరును 271 వరకు చేర్చాడు. మ్యాచ్ తొలి రోజైన శుక్రవారం ఢిల్లీ 271/6 స్కోరును సొంతం చేసుకుంది. హోల్కర్ వేదికగా సాగుతున్న మ్యాచ్‌లో ఇరు జట్లు కసికసిగా చెలరేగుతున్నయి.

తొలి రోజు నుంచే రంజీ ట్రోఫీ ఫైనల్‌ ఆసక్తికరంగా ఆరంభమైంది. తొలి శుక్రవారం టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన దిల్లీ.. ఆట ఆఖరుకు 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.

ఆదిత్య ఠాక్రే (2/65), గుర్బాని (2/44)ల ధాటికి ఢిల్లీ 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా.. ధ్రువ్‌ షోరే (123 బ్యాటింగ్‌; 256 బంతుల్లో 17×4), హిమ్మత్‌ సింగ్‌ (66; 72 బంతుల్లో 8×4, 2×6) ఐదో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యంతో స్కోరు 200 దాటించారు.

అయితే రోజు ముగుస్తుందనగా చివరి సెషన్లో విదర్భ బౌలర్లు పుంజుకున్నారు. థాకరె, రజనీష్ గుర్భానీ ఒక్కొక్కటి చొప్పున రెండు వికెట్లు పడగొట్టారు. ఆట ఆఖరుకు ధ్రువ్‌కు తోడుగా వికాశ్‌ మిశ్రా (5) క్రీజులో ఉన్నాడు.

Brief scores: Delhi 271/6 (Dhruv Shorey (batting) 123, Himmat Singh 66; Rajneesh Gurbani 2/44) vs Vidarbha.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 30, 2017, 10:26 [IST]
Other articles published on Dec 30, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+