Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Vs AUS: రిషబ్ పంత్ స్థానంలో ధృవ్ జురెల్..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో ఆస్ట్రీలియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ లో గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది. లేకుంటే ఆసీస్ సొంత అవుతుంది. అందుకే ఐదో టెస్ట్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చివరి టెస్ట్ లో ఆడే జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రిషబ్ పంత్ పట్ల జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

రిషబ్ పంత్ స్థానంలో ధృవ్ జురెల్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ యువ కీపర్-బ్యాటర్ ఈ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా Aతో జరిగిన మ్యాచ్ లో రాణించాడు. మెల్‌బోర్న్ పిచ్‌పై 80, 68 పరుగులు చేశాడు. ముంబైతో జరిగిన ఇరానీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున 93 పరుగులతో జురెల్ ఆకట్టుకున్నాడు. అయితే పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు జురెల్‌ 11, 1 పరుగే చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 పరుగులే చేశాడు. సిడ్నీ టెస్టులో పేలుడు బ్యాటింగ్ కంటే నిలకడ, స్థిరత్వంగా బ్యాటింగ్ చేసేవారికి భారత మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

Dhruv Jurel is likely to replace Rishabh Pant in Team India s final squad for the fifth Test

రెడ్-బాల్ క్రికెట్‌లో భారత్ గేమ్-ఛేంజర్‌గా రిషబ్ పంత్ వరుసగా విఫలం అవుతూ వస్తున్నాడు. నాలుగు టెస్టుల్లో, పంత్ 37, 1, 21, 28, 9, 28, 30 పరుగలు చేశాడు. 22 సగటుతో 154 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టెస్ట్ క్రికెట్ ను వన్డే క్రికెట్ లా ఆడడం వల్ల పంత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పడేసుకుంటున్నాడు. బాక్సింగ్ డే టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ పంత్ ఓ షాట్ ఆడి ఔటయ్యాడు.

దీనిపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. అక్కడ ఫిల్డర్ ఉన్నా అటే షాట్ ఎలా ఆడతావని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే తుది జట్టులో పంత్ కు స్థానం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. రిషబ్ పంత్ గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లో అదరగొట్టిన సంగి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం నిరాశ పరుస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్ లో లేనప్పటికీ అతని స్థానం పదిలంగా ఉండనుంది.

Story first published: Wednesday, January 1, 2025, 18:17 [IST]
Other articles published on Jan 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+