Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంత్ స్థానంలో అవకాశం: ఆర్మీ మ్యాన్ కొడుకు తొలి టెస్ట్ సెంచరీ!

IND vs WI: వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ అద్భుతంగా రాణించాడు. 24 ఏళ్ల ధ్రువ్ జురేల్ తన టెస్ట్ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న 2 మ్యాచ్‌ల సిరీస్‌లో ధ్రువ్ జురేల్‌కు జట్టులో చోటు దక్కడానికి ప్రధాన కారణం వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం వల్ల అవకాశం లభించింది.ఇంగ్లాండ్ పర్యటనలో రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించి రిషబ్ పంత్ కాలుకు ఫ్రాక్చర్ కావడంతో అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు.పంత్ స్థానంలోనే ధ్రువ్ జురేల్‌ను వెస్టిండీస్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు.

తొలి టెస్ట్ సెంచరీతో అరుదైన ఘనత
గతేడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన ధ్రువ్ జురేల్.. ఇప్పుడు తన ఆరో టెస్ట్ మ్యాచ్‌లో మొదటి సెంచరీని నమోదు చేశాడు. 190 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ జురేల్, 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన సెంచరీని పూర్తి చేశాడు.ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురేల్‌కు నంబర్-5 స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. గతంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఆడిన జురేల్ అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ సెంచరీతో జురేల్ జట్టులో ఒక బ్యాటర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు.టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ చేసిన 11వ భారత వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురేల్ నిలిచాడు. 1953లో విజయ్ మంజ్రేకర్‌ ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వికెట్ కీపర్.

Dhruv Jurel Army Man Son Smashes Maiden Test Century After Replacing Injured Rishabh Pant

ఆర్మీ మ్యాన్ తనయుడు
ధ్రువ్ జురేల్ తండ్రి మాజీ సైనికుడు (ఆర్మీ జవాన్) కావడం విశేషం. సెంచరీ తర్వాత తన తండ్రికి, సైనికులకు అంకితమిస్తూ, బ్యాట్‌ను రైఫిల్‌లా పట్టుకుని అతను చేసిన సెలబ్రేషన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.గతంలో రాంచీ టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై 90 పరుగుల వద్ద ఔటైన జురేల్.. ఈసారి మాత్రం సెంచరీ పూర్తి చేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.ఈ అద్భుతమైన సెంచరీతో ధ్రువ్ జురేల్ భవిష్యత్తులో భారత టెస్ట్ జట్టుకు కీలక ఆటగాడిగా మారతాడని నిరూపించుకున్నాడు.

Story first published: Friday, October 3, 2025, 16:34 [IST]
Other articles published on Oct 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+