Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ వ్యూహాలు.. తక్కువ ధరకే CSK గూటికి స్టార్ ప్లేయర్లు

ఐపీఎల్ వేలం రసవ్తతరంగా సాగుతోంది. ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. వెస్టిండీస్ బ్యాటర్ రొవ్‌మెన్ పావెల్‌తో ఆక్షన్ ప్రారంభమైంది. పావెల్ కోసం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తీవ్రంగా పోటాపోటీపడ్డాయి. రూ.7.40 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అయితే రచిన్ రవీంద్ర కోసం పోటీ తీవ్రంగా ఉందనుకుంటే సాధారణంగానే సాగింది.

బేసిక్ ప్రైజ్ రూ.50 లక్షలతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్‌ను చెన్నై సూపర్ కింగ్ రూ.1.80 కోట్లకు దక్కించుకుంది. టాప్ ఆర్డర్‌లో పరుగుల వరద పారించే సత్తా ఉన్న రచిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో రచిన్ అదరగొట్టాడు కూడా. దీంతో ఫ్రాంచైజీలు అతడి కోసం కోట్లు చెల్లిస్తారనుకుంటే సీన్ రివర్స్ అయింది.ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే కాస్త ఆసక్తి చూపించినా ఎక్కువసేపు పోటీలో నిలవలేదు.

Dhonis strategies- Star players rachin ravindra and shardul thakur for CSK at a low price

మరోవైపు టీమిండియా స్టార్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ తిరిగి చెన్నై గూటికి చేరుకున్నాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలో బరిలోకి దిగిన శార్దూల్‌ను చెన్నై రూ.4 కోట్లకు దక్కించుకుంది. బౌలింగ్‌తో పాటు భారీ షాట్లు ఆడగలిగే సత్తా శార్దూల్‌కు ఉంది. అయితే ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో సంచలన ప్రదర్శనలు చేయకపోవడంతో అతడికి డిమాండ్ కాస్త తగ్గింది.

Dhonis strategies- Star players rachin ravindra and shardul thakur for CSK at a low price

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది. కమిన్స్ కోసం ఏకంగా రూ.20.5 కోట్లు చెల్లించింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ధర పలికిన ప్లేయర్‌గా ప్యాట్ కమిన్స్‌ రికార్డు సృష్టించాడు. . అలాగే స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌ను రూ.6.8 కోట్లకు తీసుకుంది. కాగా,సన్‌‌రైజర్స్‌ను వదులుకున్న హ్యారీ బ్రూక్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లు వెచ్చించింది. సీనియర్ ప్లేయర్లు మనీష్ పాండే, స్టీవ్ స్మిత్‌పై ఏ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.మనీష్ పాండే కోసం పోటీ ఉంటదని అందరూ భావించారు. కానీ ఫలితం మరోలా వచ్చింది.

Story first published: Tuesday, December 19, 2023, 14:46 [IST]
Other articles published on Dec 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+