Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీకి జడ్ కెటగిరీ భద్రత: జార్ఖండ్ ప్రభుత్వం


రాయపూర్: ట్వంటీ 20 క్రికెట్ ప్రపంచ కప్ విజయ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి జడ్ కెటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. అంచనాలేమీ లేకుండా ట్వంటీ 20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులోకి అడుగు పెట్టిన భారత జట్టు సారథ్య బాధ్యతలు అనూహ్యంగా ధోనీ భుజం మీద పడ్డాయి. ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ప్రపంచంలోని మేటి జట్లను మట్టి కరిపించి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ధోనీపై పడింది.

జార్ఖండ్ లో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయి. ముంబయి వంటి నగర ఆటగాళ్లను తోసిరాజని చిన్న పట్టణానికి చెందిన ధోనీ ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. నగర ఆటగాళ్ల కన్నా పట్టణ ప్రాంతాల ఆటగాళ్లకే మానసిక, దేహ దారుఢ్యం అదికమని తమ జట్టుకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ధోనీ తెగేసి చెప్పాడు. మేటి భారత ఆటగాళ్లు లేకుండా ప్రపంచ కప్ ను గెలుచుకోవడం అందరినీ ముగ్ధులను చేసింది.
Story first published: Wednesday, September 26, 2007, 23:53 [IST]
Other articles published on Sep 26, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+