ఈడెన్‌లో పరువు కోసం చెమటోడ్చిన ధోని సేన(ఫోటోలు)
కోల్‌కత్తా: మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు ట్వంటీ20 మ్యాచ్ ఓటమిపాలైన టీమిండియా గురువారం (అక్టోబర్ 8)న జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ట్రైనింగ్ సెషన్‌లో తీవ్ర కసరత్తులు చేసింది. మూడు ట్వంటీ20ల సిరీస్‌లో భాగంగా ధర్మశాల టీట్వంటీలో మంచు భారత్‌ను ఓడిస్తే, కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ పేవలమైన ప్రదర్శన కనబర్చడంతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ఈడెన్‌లో పరువు కోసం చెమటోడ్చిన ధోని సేన
మరోవైపు ఈ సిరీస్‌లో గురువారం జరగనున్న మ్యాచ్ విజయం సాధించి భారత్‌ను వైట్ వాష్ చేసిన ఘనత సాధించవచ్చు. అరుదైన ఈ రికార్డును సొంతం చేసుకునేందుకు దక్షిణాఫ్రికా జట్టు ఉత్సాహంగా ఎదురు చూస్తోంది.

ఈడెన్‌లో పరువు కోసం చెమటోడ్చిన ధోని సేన
దక్షిణాఫ్రికా జట్టు మంచి ఫామ్‌లో ఉంది. టీమిండియా ఆటగాళ్లు పోరాడితే పోయేదేం లేదు, ఓటమి భయం తప్ప అనుకుంటున్నారు. టీమిండియా పరువు నిలబడాలంటే చివరి టీట్వంటీలో గెలిచి తీరాలి. అంతేకాదు ఈ గెలుపు టీమిండియాకు చాలా కీలకం. ఎందుకంటే ట్వంటీ20 సిరీస్ తర్వాత ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు అదే ఆక్సిజన్ కానుంది.

ఈడెన్‌లో పరువు కోసం చెమటోడ్చిన ధోని సేన
టీమిండియా టాప్ ఆర్డర్ బద్దకాన్ని వదిలించుకునేందుకు నానాతంటాలు పడుతోంది. రెండో టీట్వంటీలో ఓటమికి కారణంగా రక్షణాత్మకంగా ఆడడమేనని ధోనీ చెప్పడంతో చివరి టీట్వంటీలో టీమిండియా టాప్ ఆర్డర్ వేగంగా ఆడనుందని సంకేతమిచ్చాడు.

ఈడెన్‌లో పరువు కోసం చెమటోడ్చిన ధోని సేన
కాగా, ధావన్, రోహిత్, కోహ్లీ, రైనా, ధోనీతో టీమిండియా టాప్ ఆర్డర్ బలంగా ఉందని, అయితే నిలదొక్కుకుని ఆడితే తప్ప భారీ స్కోర్లు సాధ్యం కావని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. ధర్మశాల, కటర్ మ్యాచ్‌ల్లో ధావన్ తక్కువ స్కోరుకే పరిమితం కావడం జట్టును ఇబ్బందుల్లో పడేస్తోందని వారు పేర్కొన్నారు.

ఈడెన్‌లో పరువు కోసం చెమటోడ్చిన ధోని సేన
చివరి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి పరువు నిలుపుకుంటారో, లేక ఓటమితో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారో చూడాలని అభిమానులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications