
జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ
పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ "భారత జట్టులో మహేంద్ర సింగ్ ధోని అన్న మేధావి ఉన్నాడు. అతడే బ్రెయిన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఆటను అతడు గొప్పగా అర్థం చేసుకుంటాడు. దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించిన అనుభవం అతడి సొంతం. కెప్టెన్, కోచ్‌కు అతడి అనుభవం ఎంతో కీలకం. భారత జట్టు తురుపు ముక్క ధోనినే" అని అన్నాడు.

కెప్టెన్‌గా కోహ్లీకి ఇది తొలి వరల్డ్‌కప్
"కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది తొలి వరల్డ్‌కప్. కోహ్లి కూడా తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన సమయమిది. ఐసీసీ లాంటి మెగా టోర్నీలను జట్టుకు అందిస్తేనే కెప్టెన్‌గా విజయవంతమైనట్టు. కోహ్లికి ముందున్న లక్ష్యం టీమిండియాకు ప్రపంచకప్‌కు అందించడమే. ప్రస్తుతం ఇంగ్లాండ్ పిచ్‌లు బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారాయి. భారీ స్కోర్లు నమోదవుతున్నాయి" అని అబ్బాస్ తెలిపాడు.

300కి పైగా స్కోర్లు నమోదు
"పాక్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో 300కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. వరల్డ్‌కప్‌లో 450పైకి పైగా పరుగులు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఎందుకంటే టీమిండియాకు అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇంగ్లాండ్ వికెట్లు ప్రస్తుతం బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామాలు" అని చెప్పుకొచ్చాడు.

టాప్-4 బ్యాట్స్‌మెన్ స్థానాల్లో మార్పులు
"అదే కేవలం కెప్టెన్ నిర్ణయం. నాకు తెలిసి టాప్-4 బ్యాట్స్‌మెన్ స్థానాల్లో మార్పులు చేయకుండా ఉంటే బాగుంటుంది. లోయర్ ఆర్డర్‌లో మార్పులు చేయొచ్చు గానీ, టాపార్డర్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయకూడదు. ఈ మెగా టోర్నీలో ఇండియాతో పాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీపైనల్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది" అని జహీర్ అబ్బాస్ తెలిపాడు.

ఐదు వన్డేల సిరిస్‌లో ఓటమి
ఇటీవలే ఇంగ్లాండ్ చేతిలో ఐదు వన్డేల సిరిస్ ఓటమి పాకిస్థాన్‌పై ఎలాంటి ప్రబావం చూపబోదని జహీర్ అబ్బాస్ అన్నాడు. "ఇంగ్లాండ్‌పై సిరీస్ ఓటమితో పాకిస్థాన్ కుంగిపోవాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ ఆటగాళ్లు ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో ఏమైనా జరగవచ్చు. ఏ జట్టైనా గెలవొచ్చు" అని అబ్బాస్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












