హైదరాబాద్: బుధవారం పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం విరాట్ కోహ్లీ స్పందించాడు. తన ట్విట్టర్‌లో భావోద్వేగంతో కూడిన ట్వీట్‌ని పోస్టు చేశాడు. అతనొక స్ఫూర్తిదాయక నాయకుడని 'ఎప్పటికీ ధోనీయే తమ కెప్టెన్' అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
ఫోటోలు: ధోని నిర్ణయం వెనుక సెలక్టర్లు పాత్ర ఏమేరకు?
యువ ఆటగాళ్లను నిత్యమూ ఓ లీడర్‌గా ఉండి వారిని నడిపించినందుకు కృతజ్ఞతలు. నీ చుట్టూ యంగ్ స్టర్స్ ఉండాలని భావిస్తుంటావు. అన్నా ఎప్పటికీ నా కెప్టెన్ నువ్వే' అని కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
భారత క్రికెట్‌పై ధోని ప్రభావం చాలా ఉందని విదేశీ క్రికెటర్లు మైకేల్ క్లార్క్, మైకేల్ వూగన్, షాహిద్ అఫ్రిది, జహీర్ అబ్బాస్‌లు ధోనీని కొనియాడిన సంగతి తెలిసిందే. జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ గత పదేళ్లుగా ధోని నాయకత్వంలో భారత క్రికెట్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.
ధోని నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేసిన సంగతి తెలిసిందే. అయితే జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్‌కు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ధోని సమాచారం అందించాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ధోని చెప్పినట్టు బీసీసీఐ ట్విట్టర్‌లో తెలిపింది.

దీంతో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్‌కు ధోని వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా అందుబాటులో ఉంటాడు. కెప్టెన్సీకి ధోని గుడ్ బై చెప్పడంతో కోహ్లీనే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ వహించనున్నాడు. జనవరి 15న పూణెలో ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి వన్డేలో కోహ్లీ కెప్టెన్సీలో ధోని వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్‌గా ఆడనున్నాడు.