ఢిల్లీ: క్రికెటర్ హర్భజన్ సింగ్, మోడల్, బాలీవుడ్ నటి గీతా బస్రా వివాహ విందులో.. భారత వన్డే, టీ ట్వంటీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ బిగుతు దుస్తుల్లో కనిపించింది. తన దుస్తులతో విందులో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిందని చెబుతున్నారు.
భజ్జీ మ్యారేజ్ రిసెప్షన్‌లో ఈ ఆలస్యంగా వెలుగు చూడటంతో ఇది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆదివారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలోని స్టార్ హోటల్ తాజ్ ప్యాలెస్‌లో జరిగిన ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలు రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ దంపతులు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత ఫ్యాషన్ డ్రెస్సులకు వీడ్కోలు పలికిన ధోనీ సతీమణి సాక్షి సింగ్.. తాజాగా కొత్త లుక్కులో అదిరిపోయింది. బిగుతు డ్రెస్ వేసుకుని సాక్షి వచ్చింది. భజ్జీ దంపతులతో పాటు రిసెప్షన్‌కు వచ్చిన వారితోనూ సాక్షి తన భర్తతో కలిసి వివిధ పోజుల్లో ఫొటోలు దిగింది.
సాక్షి సింగ్ ధోనీ ఫ్లోర్ లెంత్ బాడీ ఫిట్ గౌన్ వేసుకుంది. నెక్ తక్కవగా ఉంది.