Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డెత్ ఓవర్లలో ఈ ప్రదర్శన చాలదు: చెన్నై బౌలర్లకు ధోని

Dhoni urges Super Kings bowlers to improve their death overs effort

హైదరాబాద్: డెత్ ఓవర్లలో చెన్నై బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాలని ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.


మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ 'డెత్ ఓవర్ల బౌలింగ్ మెరుగ్గా లేదు. మేము ఫైనల్‌కు చేరుకున్నట్లైతే, గ్రౌండ్ చిన్నగా ఉన్న మైదానాల్లో నిర్వహిస్తే కష్టమే. ఎందుకంటే చిన్న మైదానాల్లో గెలిచే మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది' అని ధోని వెల్లడించాడు.

డ్వేన్ బ్రావో లాంటి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ చివర్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో మూడు ఓవర్లు వేసి 43 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెరుగైన ప్రదర్శన కనబర్చిన దక్షిణాఫ్రికా బౌలర్ లుంగీ ఎంగిడిపై ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. 'టీమిండియా సఫారీ పర్యటనలో లుంగీ ఎంగిడి అద్భుత ప్రదర్శన చేశాడు. పొడవు ఎక్కువగా ఉండటం వల్ల బంతి బౌన్స్ అవుతుంది' అని ధోని అన్నాడు.

ఐపీఎల్ సీజన్‌లో వరుసగా మ్యాచ్‌లు ఉండటం... ఆటగాళ్ల వర్క్ లోడ్‌... ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్పులపై కూడా ధోని స్పందించాడు. 'ఆటగాళ్లు విశ్రాంతి ఇవ్వడం అనేది మామూలే. అయితే టీ20 మ్యాచ్‌లో వర్క్ లోడ్ పెద్దగా ఉండదు. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు' అని తెలిపాడు.

'మ్యాచ్‌లో చక్కటి శుభారంభాన్ని ఇవ్వడం ఎంతో కీలకం. శుభారంభం అంటే పరుగులు మాత్రమే సాధించడం కాదు, చక్కటి భాగస్వామ్యాలను నమోదు చేయడం, అందుకే నన్ను నేను ఐదో నెంబర్ స్థానానికి ప్రమోట్ చేసుకున్నా. ఇది చాలా ఫన్నీగా ఉంది. 8వ ఓవర్ లేదా 10వ ఓవర్‌లో క్రీజులోకి దిగితే హిట్టింగ్ ఎప్పుడు చేస్తామో బౌలర్‌కు తెలియడం కష్టం' అని తెలిపాడు.

'ఇక, వికెట్ విషయానికి వస్తే విదేశీ ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో శామ్ బిల్లింగ్స్‌కు విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో డుప్లెసిస్‌కు చోటు కల్పించాం. రాయుడు, డుప్లెసిస్‌తో మిడిలార్డర్ బలంగా తయారవుతాయని ఈ నిర్ణయం తీసుకున్నాం. రాయుడు ఏ స్థానంలోనైనా పరుగులు చేయగలడు' అని ధోని వెల్లడించాడు.

కాగా, సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఢిల్లీ పోరాడి ఓడింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. అనంతరం భారీ బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.

Story first published: Tuesday, May 1, 2018, 16:14 [IST]
Other articles published on May 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+