Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అవమానం: బంగ్లాపై ధోనీ ఫ్యాన్స్ రివేంజ్ ఇలా(పిక్చర్స్)

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెగిన తలను బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ తీసుకెళ్తున్నట్లుగా మార్ఫింగ్ చేసిన ఫొటో ఒకదాన్ని ఓ బంగ్లా అభిమాని ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ధోనీ అభిమానులు బంగ్లాకు గట్టి షాక్ ఇచ్చారు.

ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ధోనీ అభిమానులు పలు బంగ్లాదేశీ వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు. మూడు ప్రభుత్వ సైట్లు సహా సుమారు 20 వరకు సైట్లను భారతీయులు హ్యాక్ చేసి, ఆ విషయాన్ని ఆ సైట్ల హోంపేజిలో తెలిపారు.

Photos: Asia Cup T20 2016

కేరళ సైబర్ వారియర్స్‌కు చెందిన 15 మంది వైట్ హ్యాట్ హ్యాకర్ల బృందం ఈ సైబర్ దాడి చేసినట్లు తెలుస్తోంది. 'బంగ్లాదేశ్ పౌరులకు మా సందేశం ఇదే. మీ క్రికెట్ జట్టు మా ముందు ఎందుకూ పనికిరాదు' అన్న సందేశంతో పాటు ప్రతి సైట్‌లోనూ ధోనీ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. 'ఆపరేషన్ ట్రాల్ బంగ్లాదేశ్' అని దీనికి పేరు కూడా పెట్టారు.

తామంతా భారతీయులైనందుకు గర్వపడుతున్నామని, దేశాన్ని అవమానించే ఎలాంటి చర్యలను సహించేది లేదని ఈ బృందానికి చెందిన ఓవ్యక్తి చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలు ధోనీ మార్ఫింగ్ ఫొటోతో అతడిని అవమానించారని, దానికి ధోనీ మైదానంలో సమాధానం చెబితే.. తాము సైబర్ స్పేస్‌లో సమాధానం చెబుతున్నామని అన్నారు.

Also Read: ధోనీ అంత కసిగా కొట్టాడేంటి?: రవిశాస్త్రి వివరణ

మరిన్ని వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం ఖాయమని, మరేదైనా సైట్‌లో ధోనీ మార్ఫింగ్ ఫొటో కనిపిస్తే అది హ్యాక్ అయి తీరుతుందని హెచ్చరించారు. వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం అక్రమమేనని తమకు తెలుసని చెప్పారు.

ఇంతకుముందు అమాయకులైన అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటితో సెక్స్ చాట్లు చేస్తున్న పలు ఫేస్‌బుక్ పేజీలను, ప్రొఫైళ్లను కూడా తాము హ్యాక్ చేశామని అంటున్నారు. ప్రతియేటా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే సహా 26/11 రోజున కూడా పలు పాకిస్థానీ వెబ్‌సైట్ల మీద కూడా కేరళ సైబర్ వారియర్స్ దాడి చేస్తుండటం గమనార్హం.

ఇది ఇలా ఉండగా మరికొందరు అభిమానులు తస్కిన్ తలను ధోనీ చేతిలో పట్టుకున్న ఫొటోను ఇంటర్నెట్‌లో పెట్టారు. బంగ్లా అభిమానులను తిట్టుకుంటూ పలు వ్యాఖ్యలను సామాజిక అనుసంధాన వేదికల్లో పోస్ట్ చేశారు.

బంగ్లా అభిమాని పైత్యం

బంగ్లా అభిమాని పైత్యం

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెగిన తలను బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ తీసుకెళ్తున్నట్లుగా మార్ఫింగ్ చేసిన ఫొటో ఒకదాన్ని ఓ బంగ్లా అభిమాని ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ధోనీ అభిమానులు బంగ్లాకు గట్టి షాక్ ఇచ్చారు.

ధోనీ అభిమానుల రివెంజ్

ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ధోనీ అభిమానులు పలు బంగ్లాదేశీ వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు. మూడు ప్రభుత్వ సైట్లు సహా సుమారు 20 వరకు సైట్లను భారతీయులు హ్యాక్ చేసి, ఆ విషయాన్ని ఆ సైట్ల హోంపేజిలో తెలిపారు.

ధోనీ అభిమానుల రివెంజ్

కేరళ సైబర్ వారియర్స్‌కు చెందిన 15 మంది వైట్ హ్యాట్ హ్యాకర్ల బృందం ఈ సైబర్ దాడి చేసినట్లు తెలుస్తోంది.

బంగ్లాకు మైదానంలో బుద్ధి చెప్పాలన్న రవిశాస్త్రి

బంగ్లాకు మైదానంలో బుద్ధి చెప్పాలన్న రవిశాస్త్రి

'బంగ్లాదేశ్ పౌరులకు మా సందేశం ఇదే. మీ క్రికెట్ జట్టు మా ముందు ఎందుకూ పనికిరాదు' అన్న సందేశంతో పాటు ప్రతి సైట్‌లోనూ ధోనీ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. 'ఆపరేషన్ ట్రాల్ బంగ్లాదేశ్' అని దీనికి పేరు కూడా పెట్టారు.

ధోనీ అభిమానుల రివెంజ్

ఇది ఇలా ఉండగా మరికొందరు అభిమానులు తస్కిన్ తలను ధోనీ చేతిలో పట్టుకున్న ఫొటోను ఇంటర్నెట్‌లో పెట్టారు. బంగ్లా అభిమానులను తిట్టుకుంటూ పలు వ్యాఖ్యలను సామాజిక అనుసంధాన వేదికల్లో పోస్ట్ చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+