టీ20ల్లో ధోని స్ధానం: లక్ష్మణ్ 'తప్పుకో' వ్యాఖ్యలపై సెహ్వాగ్
హైదరాబాద్: టీ20ల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆట తీరు మారాలని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ ధోనికి చెప్పాలని సెహ్వాగ్ సూచించాడు. రాజ్ కోట్ వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో ధోని 37 బంతుల్లో 49 పరుగులు చేసిన నేపథ్యంలో అతడి ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సెహ్వాగ్ పైవ్యాఖ్యలు చేశాడు. 'టీ20ల్లో ధోని తన పాత్ర ఏంటో తెలుసుకోవాలి. భారీ లక్ష్యాన్ని ఛేదించేటపుడు ధోని ఆరంభం నుంచే పరుగులు తీయాలి. తొలి బంతి నుంచే ధాటిగా ఆడాలి. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం అతడికి అర్థమయ్యేలా చెప్పాలి' అని సెహ్వాగ్ అన్నాడు.

లక్ష్మణ్ అభిప్రాయంతో విభేదించిన సెహ్వాగ్
టీ20ల నుంచి ధోని తప్పుకుని కుర్రాళ్లకు అవకాశమివ్వాలన్న లక్ష్మణ్ అభిప్రాయంతో సెహ్వాగ్ విభేదించాడు. 'టీ20ల్లో కూడా టీమిండియాకు ధోని అవసరం ఉంది. ఆటకు ఎప్పుడు టాటా చెప్పాలో అతనికి బాగా తెలుసు. ఏ ఒక్క యువ ప్రతిభావంతుడి అవకాశాల్ని ధోని దెబ్బతీయడు' అని సెహ్వాగ్ అన్నాడు.

తిరువనంతపురం వేదికగా మూడో టీ20
ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం తిరువనంతపురం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ధోనిని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాలనే దానిపై జట్టు మేనేజ్‌మెంట్ తర్జన భర్జన పడుతోంది. తొలి టీ20లో ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చిన ఆయన తర్వాతి మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.

49 పరుగులతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న ధోని
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మన్రో సెంచరీ సాధించడంతో నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి కివీస్ 196 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. విరాట్ కోహ్లీ (65) పరుగులతో రాణించగా, ఆ తర్వాత ధోని (49) ఫరవాలేదనిపించాడు.

ధోని బ్యాటింగ్‌లో దూకుడుని తగ్గింది
అయితే టీమిండియా సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతున్న కొద్దీ ధోని బ్యాటింగ్‌లో దూకుడుని తగ్గించాడు. చివర్లో పేలవ షాట్‌కు పెవిలియన్ చేరి హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. ధోనీ చేసిన 49 పరుగుల్లో ఫోర్లు, సిక్సర్ల ద్వారా వచ్చినవి 26 మాత్రమే. ఇందుకు తీసుకున్న బంతులు 5 మాత్రమే.

టీ20లకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైంది
దీనిని బట్టి చూస్తే మిగతా 32 బంతుల్లో ధోని చేసింది 23 పరుగులే. దీంతో ధోనిపై మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. టీ20లకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని కూడా అన్నారు. దీంతో చివరి టీ20లో మరో బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే లేదా దినేశ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉండటంతో ధోనిని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాలనే సమస్యను మేనేజ్‌మెంట్ ఎదుర్కొంటోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications