For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే సిరిస్‌కు ముందే దూకేందుకు సిద్ధమైన ధోని (ఫోటో)

By Nageshwara Rao
Dhoni all set to 'fly' ahead of ODI series against Sri Lanka!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సాహస జీవనశైలి అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. పైనున్న ఫోటోని చూస్తే ఆ విషయం మీకే అర్ధం అవుతుంది. పారాచూట్‌ ధరించి విమానం నుంచి దూకేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఈ ఫొటోను ధోని శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన ధోని పారా రెజిమెంట్‌లో సైతం సైనిక శిక్షణ తీసుకున్నాడు. గతంలో 1250 అడుగుల ఎత్తు నుంచి ధోని పారా జంప్‌ చేసిన సంగతి తెలిసిందే.

2015లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ప్రస్తుతం ధోని పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు. డిసెంబర్ 10 నుంచి శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరిస్‌కు ధోని సన్నద్ధమవుతున్నాడు. టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత డిసెంబర్ 10 నుంచి లంకతో వన్డే సిరిస్ ప్రారంభం కానుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 2, 2017, 10:17 [IST]
Other articles published on Dec 2, 2017
Read in English: Dhoni all set to 'fly'
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+