Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: ధోనీ స్థానం మారనుందా..? టార్గెట్ అదే

Dhoni set for batting promotion

హైదరాబాద్: మరో 3 రోజుల్లో ఆరంభం కానున్న ఐపీఎల్‌కు చెన్నై జట్టులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల నిషేదం అనంతరం ఐపీఎల్‌కు పునరాగమనం చేయబోతున్న చెన్నై జట్టు ఐపీఎల్ కప్ గెలుచుకోవటమే టార్గెట్‌గా మిగిలిన అన్ని ఫ్రాంచైజీల కంటే ఎక్కువగానే కసరత్తులు చేస్తోంది. ఇందులో కీలకమైనది జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్థానంలో మార్పు చేయడమే.

జాతీయ జట్టు క్రికెట్‌లోనూ ధోనీ అవసరానికి తగ్గట్లుగా బ్యాటింగ్ స్థానంలో మార్పులు చేస్తుంటాడు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ అదే తరహాలో ప్రయోగాలు చేయనున్నాడట. వన్డేల్లో గతంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ఈ ఫినిషర్.. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి 6 లేదా 7వ స్థానంలో వస్తున్నాడు.

 ప్రాక్టీసులోనూ, జట్టు ప్రచారంలోనూ:

ప్రాక్టీసులోనూ, జట్టు ప్రచారంలోనూ:

అదే టీ20ల్లో మాత్రం ఆరో స్థానంలో ఫిక్సయ్యాడు. అదే తరహాలో ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ ధోనీ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవాలని భావిస్తున్నాడంట. ఎన్ని రోజుల నుంచో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7 శనివారం నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీసులోనూ, జట్టు ప్రచారంలోనూ చెన్నై జట్టు ఆటగాళ్లు జోరుగానే పాల్గొంటున్నారు.

తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌తో:

తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌తో:

తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబైలోని వాంఖడే వేదికగా ఢీకొట్టనుంది. భారీ అంచనాల మధ్య అడుగుపెడుతున్న చెన్నై జట్టు కప్ గెలవడమే లక్ష్యంగా ఆడనుందట. ఇందులో భాగంగా ఇప్పటికే హిట్టింగ్‌ ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ.. బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెన్నై కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ వెల్లడించాడు.

దూకుడుగా బ్యాటింగ్:

దూకుడుగా బ్యాటింగ్:

‘ఐపీఎల్‌లో మహేంద్రసింగ్ ధోనీ చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. అతనికి బ్యాటింగ్ స్థానంతో సంబంధం ఉండదు. కానీ.. జట్టు అవసరాలకి అనుగుణంగా అతడి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నాం.' అని స్టీఫెన్ ప్లెమింగ్ వెల్లడించాడు. ధోనీ.. మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం.

మిడిలార్డర్‌ బలంగా:

మిడిలార్డర్‌ బలంగా:

కచ్చితంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో బ్యాట్‌తో ధోనీ తన ప్రత్యేకతని చాటుకుంటాడు. కేదార్ జాదవ్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో‌లతో చెన్నై మిడిలార్డర్‌ బలంగా ఉంది. వీరిని సమర్థంగా వినియోగించుకుంటాం'

Story first published: Tuesday, April 3, 2018, 12:49 [IST]
Other articles published on Apr 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+