Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హీరోయిన్‌ వైపు ధోనీ సీరియస్ లుక్‌ - వీడియో వైరల్!

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అదిరే ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక్క దాంట్లోనే ఓడింది. తాజాగా సీస్కేతో జరిగిన మ్యాచులో 18 పరుగులు తేడాతో గెలిచింది. కానీ సీఎస్కేకు మాత్రం ఈ ఓటమి నిరాశ కలిగించేదే. అన్ని విభాగాల్లో పేలవంగా ప్రదర్శన చేస్తోన్న చెన్నై జట్టుకు ఇది వరుసగా ఇది నాలుగో పరాజయం కావడం గమనార్హం.

బంగారు అవకాశం మిస్..
ఈ మ్యాచు ఛేదనలో గెలుపు కోసం గట్టిగానే పోరాడినప్పటికీ 201/5తో సరిపెట్టుకుంది సీఎస్కే. అయితే ఈ మ్యాచులో సీఎస్కే ఓటమికి అతి పెద్ద కారణం చెత్త ఫీల్డింగే. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన శశాంక్ సింగ్ 37 పరుగులు వద్ద ఉన్నప్పుడు, అతడిని ఔట్ చేసేందుకు సీఎస్కేకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ వచ్చింది. కానీ ఫీల్డింగ్ తప్పిదం వల్ల అది బెడిసికొట్టింది.

Dhoni Serious Look When Preity Zinta Celebrates Shashank Singh Dropped Catch in pbks vs csk match

పంజాబ్‌కు ఎక్స్‌ట్రా రన్..
17వ ఓవర్‌లో శశాంక్.. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో స్లాగ్ స్పీడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అప్పుడు బంతి టాప్‌ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి లేచింది. అప్పుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన రచిన్‌ రవీంద్ర క్యాచ్ డ్రాప్‌ చేశాడు. అప్పుడు ఓవర్‌త్రో కారణంగా పంజాబ్‌కు మరో అదనపు పరుగు దక్కింది.

ప్రీతి జింటా సెలబ్రేషన్స్.. ధోనీ సీరియస్..
ఇదంతా స్టాండ్స్‌లో నుంచి చూస్తున్న పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా.. ఫుల్ జోష్‌తో ఎగిరి గంతేసింది. స్టాండ్స్‌లో అటూ ఇటూ పరిగెడుతూ సెలబ్రేషన్స్ చేసుకుంది. అదే సమయంలో చెన్నై స్టార్ ప్లేయర్ ధోనీ అసహనంతో కనిపించాడు. క్యాచ్ మిస్ చేసినందుకు ఓ సీరియస్‌ లుక్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఫైనల్‌గా ఈ ఫీల్డింగ్ తప్పిదం.. సీఎస్కేకు పెద్ద మైనస్‌గా మారింది. ఔట్ నుంచి తప్పించుకున్న శశాంక్ .. 36 బంతుల్లో 50 నాటౌట్ పరుగులు చేసి పంజాబ్ స్కోర్ పెంచాడు.

Story first published: Wednesday, April 9, 2025, 13:08 [IST]
Other articles published on Apr 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+