Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వీరూ ధోనీలతో జాన్సన్ గిల్లికజ్జాలు

Mahendra Singh Dhoni
నాగపూర్: నాగపూర్ రెండో వన్డే తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ జాన్సన్ భారత బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీలతో గిల్లికజ్జాలకు దిగాడు. ఈ విషయం గురువారం చర్చనీయాంశంగా మారింది. వారితో జాన్సన్ చిన్నపాటి వివాదానికి దిగాడు. వీరేంద్ర సెహ్వాగ్ తొమ్మిదో ఓవర్ లో తాను వేసిన బంతిని సిక్స్ గా మలిచి బౌండరీ దాటించడంతో జాన్సన్ ఏదో అన్నాడు. జాన్సన్ తర్వాతి ఓవరులో వేసిన తొలి బంతిని భారీ షాట్ కొట్టబోయి 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సెహ్వాగ్ అవుటయ్యాడు.

తర్వాత 28వ ఓవరులో పరుగు తీయబోయి ధోనీ జాన్సన్ ను ఢీకొట్టాడు. దాంతో అసంతృప్తికి గురైన ధోనీ జాన్సన్ వైపు గుర్రుగా చూశాడు. ధోనీ చాలా రోజుల తర్వాత చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచి 107 బంతుల్లో 124 పరుగులు చేశాడు. దాంతో భారత్ ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు 354 పరుగులు నమోదు చేసింది. ఈ వన్డేలో భారత్ 99 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+