రెండో వన్డేలో ధోని ఇల్లీగల్ రన్: సోషల్ మీడియాలో వీడియో వైరల్

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రెండు వరుస హాఫ్ సెంచరీలతో మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు. అడిలైడ్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ (104) సెంచరీ సాధించగా.. ధోని (55 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు.
దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే, ఛేదన సమయంలో ధోని ఒక పరుగుని సరిగా పూర్తి చేయలేకపోవడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

31 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన దశలో
టీమిండియా విజయానికి 31 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన దశలో ధోని ఈ తప్పిదానికి పాల్పడ్డాడు. స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో బంతిని మిడ్ వికెట్ దిశగా తరలించిన ధోని.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు సింగిల్ కోసం వెళ్లాడు. అయితే, క్రీజులోకి వెళ్లకుండా వెలుపలే ఆగిపోయాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేకపోయారు.

ధోని ఫినిషింగ్ టచ్‌తో
దీంతో ధోని ఖాతాలో, జట్టు స్కోరు బోర్డులోకి ఒక పరుగు చేరింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోని ఫినిషింగ్ టచ్‌తో విజయం భారత్‌నే వరించిన సంగతి తెలిసిందే. రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

298 పరుగులు చేసిన ఆస్ట్రేలియా
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో షాన్ మార్ష్ (131; 123 బంతులు,11ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ, మాక్స్‌వెల్(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ విఫలమయ్యాడు.

1-1తో సిరిస్ సమం
వికెట్ ఏమీ తీయకపోగా దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 4 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ మూడు, జడేజా ఒక వికెట్ తీశారు. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ సిరిస్‌లో చివరిదైన మూడో వన్డే మెల్‌బోర్న్ వేదికగా జనవరి 18న జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications