న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జట్టును ఎలా నడిపించాలో తెలిసిన క్రికెటర్‌ ధోని'

Dhoni's Hardware Not Keeping In Touch With Software Says Sanjay Manjrekar | Oneindia Telugu
Dhonis hardware not keeping in touch with software: Sanjay Manjrekar

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు సెహ్వాగ్‌ వంటి దిగ్గజాల ఇప్పటికే ధోనిపై ప్రశంసల వర్షం కురిపించగా... తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ స్పందించాడు.

<strong>ప్రపంచ క్రికెట్లో బెస్ట్ బ్రెయిన్‌ ధోనీదే అని ఎందుకు అంటారో తెలుసా! (వీడియో)</strong>ప్రపంచ క్రికెట్లో బెస్ట్ బ్రెయిన్‌ ధోనీదే అని ఎందుకు అంటారో తెలుసా! (వీడియో)

"ధోనీయే కాదు అతడి ఆలోచన విధానం, ఆటతీరు, కెప్టెన్సీ లక్షణాలు అన్నీ ఇప్పటికీ ఉన్నతస్థాయిలో ఉన్నాయి. తన క్రికెట్‌ కెరీర్‌ ముగిసిపోలేదని తనను వెనకేసుకొచ్చిన ఎంతో మంది మాటను ధోని నిలబెట్టుకున్నాడు. కష్ట సమయంలో జట్టును ఎలా నడిపించాలో తెలిసిన క్రికెటర్‌ ధోని. గతంలో మాదిరి సిక్స్‌లు కొట్టగలడు" అని చెప్పుకొచ్చాడు.

"మ్యాచ్‌ను ఘనంగా ముగించగలడు. పదేళ్లక్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆట పరంగా ధోని ఎలాఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ధోని గణాంకాల కంటే సామర్థ్యం గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇంకో పదేళ్ల తర్వాత కూడా ధోనీ ఇలాగే ఉంటాడు" అని మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారంతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదిన ధోని 193 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన ధోని.. మూడో వన్డేలో అంబటి రాయుడిపై వేటు పడటంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు.

మూడో వన్డేలో మహేంద్రసింగ్ ధోని (87 నాటౌట్), కేదార్ జాదవ్ (61 నాటౌట్) అజేయ అర్ధశతకాలు బాదడంతో 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి.

ఒక్క ఫార్మాట్లో కూడా సిరీస్‌ కోల్పోకుండా ఆసీస్‌ పర్యటనను ముగించిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధించింది. ఈ సిరిస్‌లో 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' గెలవడంతో ధోని ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది. అత్యంత పెద్ద వయసు (37 ఏళ్ల 195 రోజులు)లో ఈ అవార్డు గెలిచిన భారత ఆటగాడు ధోనీయే. గావస్కర్‌ (37 ఏళ్ల 191 రోజులు, 1987లో శ్రీలంకపై) రికార్డును ధోని బద్దలు కొట్టాడు.

Story first published: Monday, January 21, 2019, 17:42 [IST]
Other articles published on Jan 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X