రాంచీ: భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ముద్దుల కూతురు జీవాతో రాంచీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఇంకేముందు మీడియాతోపాటు అందరి కళ్లు ఆమెపైనే. ఇక్కడి చిత్రంలో చూడవచ్చు. మృధువైన ఓ తువాలును కప్పివున్న జీవా, తన తండ్రి ఒడిలో ఒదిగిపోయి ఉంది.
ఇంతకుముందు ధోని తన ముద్దురు కూతురు జివాతో తొలిసారిగా జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలోనే కనిపించాడు. భార్య సాక్షి, కుమార్తె జివాతో ధోని కెమెరాల కంటికి చిక్కాడు. కాగా, ధోని తన కూతురును ఎత్తుకొని ఉన్న ఫోటోను ఫేస్‌బుక్ ప్రొపైల్ పిక్‌గా పెట్టుకున్నాడు.

