బెంగళూరు: ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచకప్ గ్రూప్ - 2 మ్యాచ్‌లో భారత జట్టు ఒక్క పరుగు తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. సెమీ ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. సెమీస్ రేసు నుంచి బంగ్లా ఔట్ అయింది. ఇప్పుడు భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియాలు రేసులో ఉన్నాయి.
ఇదిలా ఉండగా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ కెప్టెన్సీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చివరి ఓవర్‌లో అతని ఫీల్డింగ్ నైపుణ్యం, అలాగే చివరి బంతికి పాండ్యాకు ఇచ్చిన అతని సలహా బాగా పనికి వచ్చింది. బంగ్లాకు చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కావాల్సి వచ్చింది.
ఫోటో గ్యాలెరీ : వరల్డ్T20
తొలి మూడు బంతుల్లో 9 పరుగులు చేశారు. మ్యాచ్ భారత్ చేజారినట్లే కనిపించింది. ఆ తర్వాత రెండు బంతుల్లో ఇద్దరు అవుటయ్యారు. చివరి బంతి సమయంలో ధోనీ ఫీల్డింగ్‌ను వ్యూహాత్మకంగా మోహరించాడు. ఆఫ్ సైడ్లో సింగిల్ రాకుండా, లెగ్ సైడ్లో భారీ షాట్ ఆడేందుకు వీలు లేకుండా ఫీల్డింగ్ పెట్టాడు.

డాట్ బాల్ పడి, బంతి తనదాకా వస్తే సింగిల్ రాకుండా రనౌట్ చేసేందుకు తన గ్లౌవ్‌ను ఒకదానిని పక్కన పెట్టాడు. అదే సమయంలో బౌలర్ పాండ్యాకు ఏం చేయాలో చెప్పాడు. ధోనీ అనుకున్నదే జరిగింది. దీంతో మ్యాచ్ మన వశం అయింది.
రెప్పపాటులో ఔట్ చేశాడు
కాగా, అంతకుముందు పదో ఓవర్లో అద్భుత స్టంపింగుతో ధోనీ... షబ్బీర్‌ను పెవిలియన్ పంపాడు. మూడో బంతిని రైనా క్వికర్ వేయగా ఫ్లిక్ షాట్ కొట్టబోయి విఫలమయ్యాడు. ఐతే అతడి కాళ్లు అప్పటికి క్రీజులో ఉన్నా తనను తాను నియంత్రించుకునే సమయంలో బహుశా ఒక సెకను పాటు కాలిని గాల్లో లేపాడు. ఇంతలో ధోని బంతితో బెయిల్‌ను పడగొట్టేశాడు.
Also Read: క్రికెట్లో ఇదో అద్భుతం!: భారత్-బంగ్లా మ్యాచ్, కీలక మలుపులివే (పిక్చర్స్)

ప్లాన్ అమలైతేనే మంచిది అనిపిస్తుంది: ధోనీ
మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. చివరి బంతికి యార్కర్ వేయొద్దని పాండ్యాకు చెప్పానని, షాట్ పిచ్ బంతిని వేయమని సూచించానని, అందుకు తగ్గట్టే ఫీల్డింగ్ మొహరించానన్నాడు. దానిని అతడు చక్కగా అమలు చేశాడని, ఇలాంటి మంచి ప్లాన్ కానీ అమలైతేనే బాగా కనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించాడు.
మహ్మదుల్లాలా భారీ షాట్‌తో ముగించే ప్రయత్నించినప్పుడు ఔటవడం సహజమని, బుమ్రా చక్కగా బౌలింగ్ చేశాడని, ఫీల్డింగ్ నిబంధనలతో అతడి రెండో ఓవర్లో ఒత్తిడిని ఎదుర్కొన్నాడని, ఇటు క్యాచ్ చేజార్చానన్నే భావన కూడా అక్కడ ప్రతిబింబించిందని, దానిని మర్చిపోమని చెప్పానని తెలిపాడు.