ధోనీ రివ్యూ సిస్టమ్ మళ్లీ వర్కౌట్ అయింది!!


దుబాయి: కెప్టెన్లకే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు మహీ. మైదానంలోని వికెట్ల వెనుక ఎంత చురుగ్గానో కనిపించే మహేంద్రసింగ్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని సూచనలేనిదే టీమిండియా కెప్టెన్ రివ్యూకి వెళ్లే సాహసం దాదాపు చేయడు. దీనికి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే కాదు.. తాజాగా ఆసియా కప్‌లో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తున్న రోహిత్ శర్మ కూడా మినహాయింపు కాదని తేలిపోయింది.

ధోనీ సూచన మేరకు రివ్యూకి వెళ్లిన రోహిత్
దుబాయ్ వేదికగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ఆరంభంలోనే ధోనీ సూచన మేరకు రివ్యూకి వెళ్లిన రోహిత్ శర్మ సఫలమైయ్యాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్థాన్ జట్టు 7.5 ఓవర్లు ముగిసే సమయానికి 24/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ దశలో ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతిని చాహల్ విసరగా.. దాన్ని ముందుకు నెట్టేందుకు పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (10) 20 బంతుల్లో 2ఫోర్లతో; ప్రయత్నించాడు.

ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం భారత్ అప్పీల్
కానీ.. బ్యాట్‌కి అందకుండా బంతి నేరుగా వెళ్లి అతడి ఫ్యాడ్స్‌ని తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం భారత్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. కానీ.. బంతి బ్యాట్‌కి తాకలేదని విశ్వసించిన ధోనీ.. తనకి సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మని రివ్యూ అడగాల్సిందిగా సైగ చేశాడు. రిప్లైలో బంతి బ్యాట్‌కి తాకలేదని.. తేలడంతో పాటు అది నేరుగా వెళ్లి వికెట్లను తాకేలా కనిపించడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఔట్‌గా ప్రకటించాడు.
మాజీ కెప్టెన్‌పై ప్రశంసలతో
తొలుత రోహిత్ రివ్యూకి వెళ్లడంపై కామెంటేటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. రిప్లైలో ధోనీ చేసిన సూచన, బంతి వెళ్లిన విధానాన్ని చూసి మాజీ కెప్టెన్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక ధోనీ రివ్యూకి తిరుగుంటుందా అంటూ నెటిజన్లు సైతం వరుస ట్వీట్లతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పాకిస్థాన్‌ను అలవోకగా ఓడించిన భారత్.
ఆసియాకప్ 'సూపర్-4' మ్యాచుల్లో టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో చెలరేగిపోతోంది. సూపర్-4 మొదటి మ్యాచులో బంగ్లాదేశ్‌పై సునాయాసంగా గెలిచిన భారత్.. మ్యాచ్ మ్యాచ్‌కూ జోరు పెంచుతూ ప్రత్యర్థుల పని పడుతోంది. ఇప్పటికే గ్రూప్ దశలో పాకిస్థాన్‌ను అలవోకగా ఓడించిన భారత్.. సూపర్-4లో ఆదివారం 9 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications