న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇప్పటికీ ధోనీనే మా కెప్టెన్.. :బీసీసీఐ వెబ్‌సైట్

Dhoni retiring? Bah! Hes still the captain

హైదరాబాద్: ఇప్పటికే అంతర్జాతీయ ఫార్మాట్ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. సంవత్సరారంభంలో జరిగిన ఐపీఎల్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రతిభ ముందు వయస్సు ఒక సంఖ్య మాత్రమే అనే స్థాయిలో ఆడి చూపించాడు. అలాంటిది ఇటీవలే మొదలైన ఇంగ్లాండ్ పర్యటనలో ఎంఎస్ ధోనీ అంతగా రాణించలేకపోతున్నాడు. దీంతో అతనిపై సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి.

దీంతో అతను ఇక విరమణ చేస్తే బాగుంటుందని కొందరు.. విరమణ ప్రకటించేశాడని కొందరు రూమర్లు పుట్టిస్తున్నారు. కానీ, అతను కెప్టెన్సీకే ఇంకా రాజీనామా చేయలేదని బీసీసీఐ టీవీ వెబ్‌సైట్ చెప్పుకొస్తుంది.

Dhoni retiring? Bah! Hes still the captain

భారత క్రికెట్‌ జట్టుకు సంబంధించి అన్ని వ్యవహారాలను పర్యవేక్షించాల్సింది బీసీసీఐనే. ఆటగాళ్ల వ్యవహారంలో ఎలాంటి ప్రకటన విడుదల చేసినా అది కచ్చితంగా వాస్తవం అని నమ్ముతాం. అలాంటిది బీసీసీఐనే నిర్లక్ష్యంతో పెద్ద తప్పు చేసింది.

ఎలాగంటే.. బీసీసీఐకి ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలతో పాటు బీసీసీఐ టీవీ పేరిట వెబ్‌సైట్‌ ఉంది. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ బీసీసీఐ టీవీలో ఆటగాళ్ల ప్రొఫైల్‌ గురించి తెలిపే పేజీలో ఓ తప్పిదం చోటు చేసుకుంది. మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రొఫైల్‌లో టీమిండియా కెప్టెన్ అని చూపిస్తోంది. అధికారిక వెబ్‌సైట్లోనే ఇలా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.

అంతేకాదు, చకచకా ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఒకవేళ ధోనీ కెప్టెన్‌గా ఉంటే మరి కోహ్లీ పరిస్థితేంటి. అది కూడా ఓ సారి గమనిస్తే, కోహ్లీ కూడా కెప్టెన్‌గానే కనిపిస్తుందంట.

Story first published: Friday, July 20, 2018, 10:49 [IST]
Other articles published on Jul 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X