Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీకి రెస్ట్: హైదరాబాదీ ఓఝాకు చోటు

Verinder Sehwag
ముంబయి: శ్రీలంక టెస్టు సిరీస్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన క్రికెట్ జట్టును ఎంపిక చేసింది. విశ్రాంతి కావాలని కోరిన వైస్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పక్కకు పెట్టారు. అలాగే యువరాజ్ సింగ్ కు కూడా జట్టులో స్థానం కల్పించలేదు. వీరేంద్ర సెహ్వాగ్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. అనిల్ కుంబ్లే కెప్టెనుగా కొనసాగుతాడు. సీనియర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వివియస్ లక్ష్మణ్ జట్టులో తమ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది.

గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మలు కూడా టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. ఓపెనర్ వాసిం జాఫర్, ఇర్ఫాన్ పఠాన్ లకు చోటు దక్కలేదు. హైదరాబాద్ కు చెందిన స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝాకు జట్టులో స్థానం దక్కింది. జట్టులో ఓఝా ఒక్కడే కొత్తవాడు. ధోనీ అందుబాటులో లేకపోవడంతో పార్థివ్ పటేల్ కు జట్టులో స్థానం దక్కింది. మరో వికెట్ కీపరు దినేష్ కార్తిక్ కూడా జట్టులో ఉంటాడు. హర్భజన్ సింగ్ కూడా జట్టులో ఉంటాడు. గాయంతో బాధపడుతున్న శ్రీశాంత్ కు జట్టులో చోటు దక్కలేదు.

జట్టు సభ్యులు: అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వివియస్ లక్ష్మణ్, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, ఆర్పీ సింగ్, మునాఫ్ పటేల్, రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్, ప్రజ్ఞాన్ ఓఝా, పార్థివ్ పటేల్
Story first published: Tuesday, July 8, 2008, 16:39 [IST]
Other articles published on Jul 8, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+