న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: ధోనికి మన్కడింగ్ వార్నింగ్ ఇచ్చిన పాండ్యా (వీడియో)

IPL 2019 : MS Dhoni Receives A Rare 'Mankad' Signal From Krunal Pandya || Oneindia Telugu
Dhoni Receives a Rare Mankad Warning From Krunal Pandya and Fans are Not Amused

హైదరాబాద్: మన్కడింగ్.. ఐపీఎల్ 2019 సీజన్‌లో తెరపైకి వచ్చిన పేరు. సీజన్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ రనౌట్ చేయడంతో దీనిపై తీవ్రమైన చర్చ జరిగింది. బట్లర్‌ను మన్కడింగ్ రనౌట్ చేయడం ద్వారా అశ్విన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ విషయంలో పలువురు అశ్విన్‌కు మద్దతుగా నిలిస్తే.... మరికొందరు అశ్విన్‌ తీరుని తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత ఇదే మన్కడింగ్‌పై ఓ మ్యాచ్‌లో ముంబై బౌలర్ కృనాల్ పాండ్యాపై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. పంజాబ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను కృనాల్ పాండ్యా మన్కడింగ్ ఔట్ చేయకుండా వార్నింగ్‌తోనే సరిపెట్టాడు.

పాండ్యా తీరుపై అభిమానులు

పాండ్యా తీరుపై అభిమానులు

పాండ్యా తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, తాజాగా బుధవారం వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా.. చెన్నైకెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మన్కడింగ్ వార్నింగ్ ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

చెన్నైకి 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ముంబై

చెన్నైకి 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ముంబై

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో హార్దిక్ పాండ్యా, పొలార్డ్ విజృంభషణతో ముంబై ఏకంగా 45 పరుగులు రాబట్టింది. దీంతో చెన్నైకి 171 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

బౌలింగ్‌ను మధ్యలోనే ఆపి ధోనికి వార్నింగ్

బౌలింగ్‌ను మధ్యలోనే ఆపి ధోనికి వార్నింగ్

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్ 14వ ఓవర్లో కేదార్ జాదవ్‌కు బౌలింగ్ చేస్తున్న కృనాల్ పాండ్యా ఒక్కసారిగా తన బౌలింగ్‌ను మధ్యలోనే ఆపి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ధోనికి పరోక్షంగా మన్కడింగ్ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపించాడు. అయితే ఆ సమయానికి ధోనీ ఇంకా పూర్తిగా క్రీజును వదలక పోవడం విశేషం.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కృనాల్ పాండ్యా చర్యపై ధోని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేస్తున్నారు. "ధోని చాలా స్మార్ట్.. అతన్నే నువ్వు మన్కడింగ్ చేస్తావా?" అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో చెన్నై 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Story first published: Thursday, April 4, 2019, 14:36 [IST]
Other articles published on Apr 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X