Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఐపీఎల్ ప్రాక్టీస్ కోసం.. చెన్నై చేరుకున్న ధోనీ!

Dhoni reaches Chennai to participate in CSK training camp

దేశంలో ఇప్పటి నుంచే ఐపీఎల్ హీట్ మొదలైంది. కీలక ఫ్రాంచైజీలు అననీ కూడా తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ క్యాంపులు ఏర్పాటు చేసింది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి స్టార్ జట్లు కూా ఈ ఫ్రాంచైజీ వార్‌లో పాలు పంచుకుంటున్నాయి. సీనియర్లు, జూనియర్లు అనే భేదం లేకుండా అందరూ ప్రాక్టీసుకు హాజరై తన సత్తాను మెరుగు పరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా చెన్నైలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనేందుకు అక్కడకు చేరుకున్నాడు. బిడ్డ జీవాతో కలిసి ఎయిర్‌పోర్టులో దిగిన ధోనీకి అక్కడ మంచి అనుభవం లభించింది. వీళ్లిద్దరూ ఎయిర్‌పోర్టులో ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట అవడం ఖాయం తప్పదు. కాగా, ఇప్పటికే వస్తున్న రిపోర్టులను చూసుకుంటే ఇదే ధోనీ ఆఖరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతోంది. గతేడాది తన రిటైర్‌మెంట్ గురించి మాట్లాడిన ధోనీ.. చెన్నై ప్రజల ముందే తన చివరి మ్యాచ్ ఆడతానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ సారి జరిగే ఐపీఎల్ స్టార్ తర్వాత ధోనీ మళ్లీ ఎల్లో జెర్సీలో కనిపించడని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

కాగా, ఐపీఎల్ కోసం చాలా రోజుల ముందు నుంచే ధోనీ తన సాధన మొదలు పెట్టాడు. ఇప్పుడు చెన్నైలో సూపర్ కింగ్స్ యంగ్ టీమ్మేట్స్ రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్ కూడా చెన్నైకి చేరుకొని ఈ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. గతేడాది గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన ఈ ఇద్దరూ కూడా ఐపీఎల్‌లో రాణించి మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అదే సమయంలో ధోనీకి దాదాపుగా ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తుండటంతో ట్రోఫీ కూడా చెన్నై గెలిస్తే అతనికి ఘనంగా వీడ్కోలు పలికినట్లు ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Story first published: Friday, March 3, 2023, 12:39 [IST]
Other articles published on Mar 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+