Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

100 మీటర్ల పరుగు పందెం: ధోని Vs పాండ్యా, ఎవరు గెలిచారంటే?

Dhoni and Pandya go for a 100M dash

హైదరాబాద్: ఫిట్‌నెస్‌ విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యువ ఆటగాళ్లతో పోటీ పడుతున్నాడు. మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య బుధవారం రెండో వన్డే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక... భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఇదిలా ఉంటే రెండో వన్డేకి ముందు భారత ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు 100 మీటర్ల పరుగు పందెంలో పోటీ పడ్డారు. ఈ 100 మీటర్ల పరుగు పందెంలో ఎవరు గెలుచారో తెలియాలంటే ఈ వీడియోని మీరు వీక్షించాల్సిందే.

ఈ పరుగు పందెంలో పాండ్యాకు పోటీగా ధోని పరిగెత్తడం విశేషం. వీరిద్దరూ చిరుతల్లా పరిగెత్తి.. ఉసేన్ బోల్ట్‌ను మైమరిపించారు. ఇద్దరూ సమానంగా పరిగెత్తినప్పటికీ.. చివర్లో పాండ్య అలసిపోయినట్లు కనిపించాడు. కానీ ధోనీ మాత్రం ఆఖరి వరకూ ఒకే వేగంతో రన్నింగ్ చేయడం ఆశ్చర్యం కలిగించింది.

తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన పాండ్యాను ధోనిని ఓడించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. వయసు మీద పడుతున్నా.. ధోనిపై ఫిట్‌నెస్ లెవెల్స్ ఎంతమాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు ఈ వీడియోని వెయ్యికి పైగా నెటిజన్లు రీట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే మొహాలి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ (15), శిఖర్‌ ధావన్‌ (17) పరుగులతో క్రీజులో ఉన్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 13, 2017, 14:39 [IST]
Other articles published on Dec 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+