టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పటికప్పుడు సరికొత్త అవతారంలో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంటారు. కొత్త లుక్స్ లో కుర్రకారుకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తుంటారు. హెయిల్ స్టైల్, డ్రెస్సింగ్.. ఇలా అన్నింటిలో యమా స్టైలిష్ గా డాషింగ్ లుక్ లో కనుపడుతుంటారు. తాజాగా ఆయన టీమిండియా - న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సరికొత్త లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు.
ధోనీ.. రీసెంట్‌గానే ఐపీఎల్ 2025 కోసం సీఎస్కే ప్రాక్టీస్ క్యాంపునకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే చెన్నైలో అడుగుపెట్టి సీఎస్కే జట్టుతో కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికార సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ధోనీకి సంబంధించిన కొత్త ఫొటోను పోస్ట్ చేసింది. ఇందులో ధోనీ తమిళనాడు సంప్రదాయ పంచెకట్టులో మాస్ గా కనిపించి ఆకట్టుకున్నారు. వైట్ అండ్ వైట్ పంచెకట్టు, షర్ట్ ధరించి.. చేతిలో ఫోన్, చేతికి వాచ్, ముఖానికి స్టైలిష్ కళ్లజోడు, కాలికి టాప్ బ్రాండ్ షూస్ ధరించి యమా స్టైలిష్ గా నడుస్తూ కనిపించారు. ఏదో హోటల్ లోని కారిడర్ లో నడుస్తున్నట్లుగా కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
ఇది చూసిన అభిమానులు 'హ్యాండ్ సమ్, అడ్మిరబుల్ కూల్ కెప్టెన్ ధోనీ, మాస్ లుక్ అదిరింది', 'సౌత్ లుక్ లో మహీ అమేజింగ్, స్టన్నింగ్', 'తమిళనాడు తలా సంప్రదాయ మాస్ లుక్', 'ఫైర్, అల్టీమేట్ స్వాగ్'.. ఇలా కొన్ని వేల కామెంట్లు పెడుతున్నారు.
Saareyy! Thala Mass’u! 🦁🔥😎#WhistlePodu 🦁💛 pic.twitter.com/9YfawufaeA
— Chennai Super Kings (@ChennaiIPL) March 9, 2025
కాగా, మహీ ఎప్పుడూ హెయిర్ కటింగ్ పై చేసే ప్రయోగాలు ట్రెండ్ సృష్టిస్తూనే ఉంటాయి. క్రికెటర్‌గా కెరీర్ ఆరంభిస్తున్న రోజుల్లోనే పొడవాటి జట్టుతో ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచీ మహీ ఏ కొత్త లుక్‌లో కనిపించినా ఫ్యాన్స్ ఫిదా అయిపోతూనే ఉంటారు.