Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెట్ ప్రాక్టీస్ లో అదర గొట్టిన ధోనీ: ఐపీఎల్ మ్యాచుల్లో బౌలర్లకు చుక్కలే!

IPL 2019: MS Dhoni Joins CSK Practice,Warms Up for IPL In Style | Oneindia Telugu
Dhoni net practicing in Chennai for upcoming IPL

చెన్నై : క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. మరో వారం రోజులు. అంతే! ఈ నెల 23వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుల హోరాహోరీగా తలపడబోతున్నాయి.

దీనికోసం ఇరు జట్లూ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇప్పటికే చెన్నై చేరుకున్న సూపర్ కింగ్స్ జట్టు నెట్ ప్రాక్టీస్ లో తలమునకలైంది. ఈ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ చాలాసేపు నెట్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. డైనమేట్ వంటి షాట్లు ఆడారు.

Dhoni net practicing in Chennai for upcoming IPL

ధోనీ, సురేశ్‌రైనా, అంబటిరాయుడుతో పాటు పలువురు ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌ లో ప్రాక్టీస్ చేశారు. కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ హస్సీ ఆటగాళ్లకు సూచనలు ఇచ్చారు. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా ధోనీ ఎక్కువగా భారీ షాట్లు ఆడాడు. యువ బౌలర్ల బౌలింగ్‌లో వరుసపెట్టి సిక్సర్లు బాదాడు.

దీనికి సబంధించిన వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. నెట్ ప్రాక్టీస్ లో ధోనీ తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడ్డారు. పాదాలను చురుగ్గా కదుపుతూ భారీ షాట్లు ఆడాడు. అతను కొట్టి ప్రతి షాట్ కూడా బంతి స్టాండ్స్ లో వెళ్లి పడింది. దీనితోఈ సారి కూడా ఐపీఎల్ లో ధోనీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారని అంటున్నారు.

Story first published: Sunday, March 17, 2019, 17:00 [IST]
Other articles published on Mar 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+