ధోని ఆడుతూనే ఉంటావా?: దినేశ్ కార్తీక్ ఎంతో నష్టపోయాడు
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ కెరీర్‌పై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. 2019 వరల్డ్ కప్ జట్టులో ధోని ఉంటాడనే సెలక్టర్ల సంకేతాలపై వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ధోని వల్ల దినేశ్ కార్తీక్ చాలా నష్టపోయాడని గంభీర్ అన్నాడు.
నిలకడగా రాణిస్తేనే ధోనికి జట్టులో చోటని లేకపోతే ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని ఇప్పటికే సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఫామ్‌లోలేని ధోనీని ఎందుకు ఎంపిక చేశారని, వరల్డ్ కప్ వరకూ అతను ఫామ్ కోల్పోకుండా అలానే ఉండగలడా? అని గంభీర్ ప్రశ్నించాడు.

గత ప్రదర్శనల ఆధారంగా జట్టుకు ఎంపిక చేయడం కాదని, ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ఉండాలని సెలక్టర్లకు గంభీర్ చురకలంటించాడు. '2019 ప్రపంచకప్ జట్టులో ఉండాలంటే ధోనీకి ఒకటే దారి.. అప్పటి వరకు అతను ఫామ్ కొనసాగించడమే. ఎవరికైనా ఒకే ప్రతిపాదిక ఉండాలి. అంతేకానీ గతాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు' అని గంభీర్ పేర్కొన్నాడు.
'ఒకప్పుడు భారత్ జట్టుకి చాలానే చేశారు. గతాన్ని చూపి.. నాకు ఇష్టమైన రోజులు ఆడతానంటే ఎలా? ఈ విషయంలో దినేశ్ కార్తీక్ చాలా అవకాశాలు కోల్పోయాడు. ఒకవేళ అతనికి అవకాశం ఇచ్చుంటే.. అతనూ నిరూపించుకునేవాడే. ధోనీ వల్ల రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైపోయాడు' అని గంభీర్ కాస్తంత ఘాటుగానే స్పందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications