Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రాక్టీసుకి హాజరుకాలేకపోయిన ధోనీ, సమరానికి సిద్ధమవుతోన్న రైనా

 Dhoni misses practice session

హైదరాబాద్: చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మూడు రోజుల క్రితం పంజాబ్ జట్టుతో ఆడుతున్న సమయంలో మహీ చాలా ఇబ్బందులకు గురైయ్యాడు. ఫిజియో సాయంతో.. మ్యాచ్‌ను పూర్తి చేశాడు. కానీ, శుక్రవారం జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులో ఉండేట్లుగా ఏమీ కనిపించట్లేదు. ఇంకా కోలుకోలేని పక్షంలో అతను ప్రాక్టీస్‌కు కూడా హాజరుకాలేకపోయాడట. దీంతో పాటు చెన్నై జట్టులో మరో ప్రధాన విషయం గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన రైనా కోలుకొని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. చెన్నైలో సొంతగడ్డపై జరగాల్సిన మ్యాచ్‌లన్ని పుణెకు తరలిన సంగతి తెలిసిందే.

పుణెలో శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో చెన్నై ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొన్నారు. కానీ, ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ మాత్రం హాజరుకాలేదు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఒకింత నిరుత్సాహానికి గురైయ్యారు. ధోనీ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదంటే అతడు రాజస్థాన్‌ రాయల్స్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనిపై ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ ఏమీ మాట్లాడటం లేదు. మరోపక్క గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన రైనా కోలుకుని ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఆదివారం కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ నడుం నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఒకానొక సమయంలో నొప్పిని భరించలేని ధోనీ ఫిజియోను పిలిపించుకుని ట్రీట్‌మెంట్‌ కూడా చేయించుకున్నాడు. ఈ గాయం నుంచే ధోనీ ఇంకా కోలుకున్నట్లు లేదు. రాజస్థాన్‌ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పూణె వేదికగా తలపడనుంది.

ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకూ స్కోరు పెరగకపోవడంతో చివర్లో ఊపందుకున్న ధోనీ కేవలం 44 బంతుల్లో 79పరుగులు చేశాడు. భారీ టార్గెట్‌ను క్షణాల్లో తగ్గించేసినా చివరికి నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.

Story first published: Thursday, April 19, 2018, 19:06 [IST]
Other articles published on Apr 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+