For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అట్లుంటది ధోనీతోటి.. చివరి బంతికి ధోనీ మార్క్ ఫినిషింగ్.. చెన్నై విజయం

dhoni super finishing with mumbai indians. in last over

చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ తీవ్ర ఉత్కంఠభరితంగా సాగింది. చివరి రెండు ఓవర్లలో చెన్నైకు 28పరుగులు కావాల్సిన తరుణంలో 19ఓవర్లో బంతిని అందుకున్న బుమ్రా.. 11పరుగులిచ్చాడు. ఆ ఓవర్లో ప్రిటోరియస్ రెండు ఫోర్లు కొట్టాడు. ఇక చివరి ఓవర్లో 17పరుగులు కావాల్సిన తరుణంలో ఉనద్కత్ బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతికి ప్రిటోరియస్ (22పరుగులు 14బంతుల్లో) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. రెండో బంతికి బ్రావో సింగిల్ తీశాడు. మూడో బంతికి ఎంఎస్ ధోనీ స్టైయిట్‌గా సిక్స్ బాదాడు. రెండో బంతికి బ్యాక్ సైడ్ ఫోర్ బాదాడు. 5వ బంతికి 2పరుగులు వచ్చాయి. ఇక చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమైన దశలో ధోనీ.. లాంగ్ ఆన్‌లో ఫోర్ బాది మ్యాచ్ గెలిపించాడు. దీంతో తనలోని ఫినిషర్‌ను మరోసారి ప్రపంచానికి చూపించాడు. ధోనీ 3ఫోర్లు, 1సిక్సర్ల సాయంతో 13బంతుల్లో కీలక 28పరుగులు చేశాడు.

ఐపీఎల్‌-2022లో భాగంగా గురువారం డివై పాటిల్ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌ వర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 156పరుగుల లక్ష్యాన్ని విధించగా.. చెన్నై ఛేదించింది. 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఛేజింగ్‌కు దిగిన చెన్నైకి మొదట్లో శుభారంభం దక్కలేదు. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గోల్డెన్ డక్ అయ్యాడు. ముంబై బౌలర్ డానియల్ సామ్స్ తన తొలి బంతికే రుతురాజ్ గైక్వాడ్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. తన మూడో ఓవర్లోనూ సాంట్నర్‌(11)కు ఊరించే బంతి వేయగా.. అతను గాల్లోకి లేపాడంతో క్యాచ్ ఔటయ్యాడు. కేవలం 16పరుగులకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ చెన్నైను రాయుడు, రాబిన్ ఉతప్ప హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో ట్రాక్‌లో పెట్టారు. ఈ క్రమంలో ఉతప్ప (30పరుగులు 25బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), రాయుడు (40పరుగులు 35బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో బంతి అందుకున్న ఉనద్కత్ తన టెక్నిక్ బంతితో రాబిన్ ఉతప్పను ఊరించగా.. అతను లెగ్ సైడ్ హిట్ చేశాడు. బంతి నేరుగా బ్రెవిస్ చేతిలో పడింది. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే (13)నిరాశపరిచాడు.. సామ్స్ బౌలింగ్‌లో రాయుడు కొట్టిన షాట్‌ను లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కీరన్ పొలార్డ్ అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. కెప్టెన్ రవీంద్రా జడేజా (3)సైతం క్రీజులో నిలబడలేకపోయాడు. ఇక చివర్లో ప్రిటోరియస్ కీలక 22పరుగులు చేయగా.. ధోనీ చివరి ఓవర్లో తనదైన స్టైల్లో చెన్నైను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్ డానియల్ సామ్స్ (4-0-30-4) 4వికెట్లతో సత్తాచాటాడు.

dhoni super finishing with mumbai indians. in last over

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : ముఖేశ్ చౌదరి
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ : ఎంఎస్ ధోనీ
డ్రీమ్ 11 గేమ్ ఛేంజర్ : డానియల్ సామ్స్,
లెట్స్ క్రాకింగ్ సిక్సెస్ అవార్డ్ : అంబటి రాయుడు
క్రెడ్ పవర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : ముఖేశ్ చౌదరి
అప్ స్టాక్స్ మోస్ట్ వాల్యుబుల్ అసెట్ ఆఫ్ ది మ్యాచ్ : ముఖేశ్ చౌదరి
స్విగ్గీ ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్ : మెరిడిత్
రూపే ఆన్ ది గో ఫోర్స్ ఆఫ్ ది మ్యాచ్ : తిలక్ వర్మ

ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప.. ముంబై ప్లేయర్ హ్రితిక్ సోకిన్ వేసిన బౌలింగ్లో బాల్‌ను స్లోగా డిఫెండ్ చేయగా.. దాన్ని హ్రితిక్ చాకచక్యంగా అందుకున్నాడు. ఔటో కాదో తెలియని గందరగోళం నడుమ.. క్లియర్ ఔట్ అంటూ హ్రితిక్ సంబరాలు చేసుకోవడం ప్రారంభించాడు. రాబిన్ మాత్రం బాల్ భూమికి తాకిందంటూ పేర్కొనడంతో విషయం థర్డ్ అంపైర్ దగ్గరికి వెళ్లింది. రిప్లేలో చూసిన థర్డ్ అంపైర్ భూమికి బంతి తాకిందంటూ నాటౌట్ ఇచ్చాడు. అయితే ముంబై కెప్టెన్ రోహిత్ మాత్రం అది ఔట్ లాగా ఉంటే నాటౌట్ ఇచ్చారేంటని అంపైర్‌తో కాసేపు వాదించాడు.

ఇరు తుది జట్లు ఇవే
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (w), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, హృతిక్ షోకీన్, రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోని (w), డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి

Story first published: Friday, April 22, 2022, 8:08 [IST]
Other articles published on Apr 22, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+