హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. అయినా సరే మరోసారి ధోనికి సారథ్య బాధ్యతలు దక్కాయి. అయితే అది ప్రధాన మ్యాచ్ అనుకంటే పొరపాటు పడ్డట్టే, ఎందుకంటే అది వార్మప్ మ్యాచ్ కాబట్టి. జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని సెలక్షన్ కమిటీ శుక్రవారం ఎంపిక చేసింది.
వన్టే, టీ20 సిరీస్ ఆడనున్న టీమిండియా జట్టుకు విరాట్ కోహ్లీయే కెప్టెన్ అని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించారు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని రెండు ఫార్మాట్లలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి వార్మప్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా ధోనిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
భారత్ 'ఎ' జట్టుకు ధోని నాయకత్వం వహిస్తాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. ఇక ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో అజింక్య రహానే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. మొదటి వార్మప్ మ్యాచ్‌కు భారత్ 'ఎ' జట్టులో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడుకు చోటు కల్పించారు.

మొదటి వార్మప్ మ్యాచ్‌కు భారత్ 'ఎ' జట్టు:
మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), ధావన్, మన్‌దీప్, రాయుడు, హార్ధిక్ పాండ్యా, సంజూ శామ్సన్, కుల్దీప్, యువరాజ్, యాదవ్, చాహల్, నెహ్రా, మొహిత్ శర్మ, సిద్ధార్థ కాల్
రెండో వార్మప్ మ్యాచ్‌కు భారత్ 'ఎ' జట్టు:
రహానేతో పాటు షెల్డాన్ జాక్సన్, శంకర్, నదీం, పంత్, రైనా, దీపక్ హుడా, ఇషాన్ కిషన్, పర్వేజ్ రసూల్, వినయ్ కుమార్, పదీప్ సాంగ్‌వాన్, అశోక్ దిండా