
హైదరాబాద్: ఆసియాకప్ ఫైనల్స్ సందర్భంగా ప్రముఖ కామెంటేటర్, క్రికెట్ ఎనలిస్ట్ హర్షా భోగ్లే తన ఆసియాకప్ XI జట్టుని ప్రకటించాడు. హర్షా భోగ్లే ప్రకటించిన ఈ జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి చోటు కల్పించకపోవడం విశేషం.
ధోనికి చోటు కల్పించకపోవడం వెనుక ఉన్న కారణాన్ని ఓ క్రికెట్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో హర్షా భోగ్లే వివరించారు. ఈ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోని పెద్దగా రాణించింది లేదని, బ్యాట్‌తో కూడా పెద్దగా మెరుపులు మెరిపించిన దాఖలా లేదని తెలిపాడు.
ధోని లేకున్నా టీమిండియా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉందని చెప్పుకొచ్చాడు. హర్షా భోగ్లే ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఓపెనర్లుగా ఉన్నారు. ఇక, మూడో స్థానాన్ని తెలుగుతేజం అంబటి రాయుడికి కట్టబెట్టాడు.
ఈ టోర్నీలో అంబటి రాయుడు అధ్భుతమైన ఫామ్‌లో ఉండటంతో పాటు, ప్రతి మ్యాచ్‌లోనూ అతడు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని తెలిపాడు. ఇక, నాలుగో స్థానానికి బంగ్లా బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్, ఐదో స్థానానికి పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ఎంపిక చేశాడు.
భోగ్లే ఎంపిక చేసిన జట్టులో ఇద్దరు ఆల్ రౌండర్లు ఉండటం విశేషం. ఆప్ఘనిస్థాన్‌కు చెందిన మహ్మద్ నబీతో పాటు చివరి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు చోటు కల్పించాడు. ఆప్ఘన్‌కు చెందిన రషీద్ ఖాన్‌ను ప్రధాన స్పిన్నర్‌గా తన జట్టులో చోటు కల్పించాడు.
భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి చోటు కల్పించక పోవడం విశేషం. ఆ తర్వాత భారత పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రాలతో పాటు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌కు జట్టులో చోటు కల్పించాడు.
హర్షా భోగ్లే ఎంపిక చేసిన ఆసియాకప్ XI జట్టు:
1. శిఖర్ ధావన్
2. రోహిత్ శర్మ
3. అంబటి రాయుడు
4. ముష్ఫికర్ రహీమ్
5. షోయబ్ మాలిక్
6. మహ్మద్ నబీ
7. రవీంద్ర జడేజా
8. భువనేశ్వర్ కుమార్
9. జస్ప్రీత్ బుమ్రా
10. రషీద్ ఖాన్
11. ముస్తాఫిజుర్ రెహ్మాన్
కాగా, దుబాయి వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు మళ్లీ పూర్తిస్థాయి జట్టుతో భారత్ బరిలోకి దిగుతున్నది. ఓపెనర్లు రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్ మళ్లీ టీమ్‌లోకి వచ్చారు.
ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో రాణించిన కేఎల్ రాహుల్ టీమ్‌లో ఉంటాడని భావించినా.. దినేష్ కార్తీక్‌నే కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఇక ఇప్పటికే ఆరుసార్లు ఏషియాకప్ గెలిచిన భారత్.. రికార్డు స్థాయిలో ఏడోసారి టైటిల్‌పై కన్నేసింది.