Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రత్యర్ధి జట్టుకు ముచ్చెమటలే: ధోని-కోహ్లీ జోడిపై

న్యూఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు రావడం జట్టుకు ఎంతగానో కలిసొచ్చే విషయమని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ అభిప్రాయపడ్డాడు. ఈ నిర్ణయం జాతీయ జట్టుకు ఎంతో మేలు చేసేదిగా ఉందని పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 261 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడి 19 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రభావం చూపే ఆటగాళ్లలో ధోని ప్రమాదకరమైన ఆటగాడిగా అభివర్ణించాడు.

ఒత్తిడిలో కూడా రాణిస్తూ జట్టును విజయం వైపుకి తీసుకెళ్ల గలిగే సత్తా ఉన్న క్రికెటర్లు ధోని, కోహ్లీ అని అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌లో పరుగుల ఛేదన అంత సులువు కాదని, అదొక ఆర్ట్‌ అని అయితే వీరిద్దరూ క్రమ క్రమంగా దానిని అధిగమించారని తెలిపాడు.

Dhoni-Kohli batting together will be the biggest threat to any team: McCullum

ప్రస్తుత వరల్డ్ క్రికెట్‌‌లో ధోని, కోహ్లీ ఇద్దరూ మంచి ఫినిషర్లుగా అభివర్ణించాడు. 'ధోని గొప్ప నాయకుడు. అంతకంటే ప్రమాదకరమైన ఆటగాడు కూడా. ప్రస్తుతం టెస్టు క్రికెట్ కు దూరంగా ఉంటున్న ధోని, పరిమిత ఓవర్ల క్రికెట్ పైనే ఎక్కువ దృష్టి సారించాడు. ఆ క్రమంలోనే అతని బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా చాలా ముందుకొచ్చాడు' అని మెక్ కల్లమ్ పేర్కొన్నాడు.

విశాఖలో ఐదో వన్డే: న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తుందా?

ధోని టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం మ్యాచ్‌పై తప్పక ప్రభావం చూపుతుందని తెలిపాడు. ధోని నాలుగో స్ధానంలో బ్యాటింగ్ కు రావడం తననేమీ ఆశ్చర్య పరచలేదని అన్నాడు. ప్రస్తుత భారత క్రికెట్ లో ఈ ఇద్దరు క్రికెటర్లకు చాలా అనుభవం ఉందని అన్నాడు.

ఒత్తిడిలో కూడా మ్యాచ్ లను తమవైపుకు తిప్పుకునే సామర్థ్యం వారి సొంతం. చాలా ప్రశాంతంగా వారి పని ముగిస్తారు. ఇలా లక్ష్య ఛేదనలో ఒకర్నినొకరు అర్ధం చేసుకుని విజయాల్ని సాధించడం అంత తేలిక కాదు. ఆ ఇద్దరి క్రికెటర్లు ఒకేసారి క్రీజులో ఉంటే అభిమానులకు తగినంత వినోదాన్నిఅందిస్తారని మెక్‌కల్లమ్ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+