ముంబై: క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, ఆర్ అశ్విన్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌తో కలిసిన చేసిన ఓ అడ్వర్టయిజ్‌మెంట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఓ మొబైల్ ఫోన్ ప్రచారం కోసం తీసిన వాణిజ్య ప్రకటనలో వీరందరూ కలిసి హల్‌చల్ చేశారు.

ఈ యాడ్‌లో.. అశ్విన్ స్మార్ట్ ఫోన్‌లో కంగనా రనౌత్ వీడియో చూస్తుంటాడు. అదే సమయానికి ధోనీ, కోహ్లీ అక్కడకు వస్తారు. అప్పుడే కంగనా కూడా అక్కడకు వస్తుంది. ధోనీ, కోహ్లీలు ఆమెను అక్కడే చాటుగా ఉంచుతారు. అశ్విన్ వద్దకు వెళ్తారు.
మళ్లీ కంగనానే చూస్తున్నావా అని అతడిని అడుగుతారు. దానికి అశ్విన్ స్పందిస్తూ... ఇదేం ఫోన్ చెత్తగా ఉందని, ఇందులో పిక్చర్ క్వాలిటీ బాగా లేదని విసుక్కుంటాడు.
దానికి ధోనీ, కోహ్లీలు లైఫ్ అనే స్మార్ట్ ఫోన్‌ను అశ్విన్ చేతికి ఇచ్చి.. 'ఇందులో పిక్చర్ క్వాలిటీ అదిరిపోద్దీ.. ఒక్కసారి స్క్రీన్ టచ్ చేస్తే కంగానా నీ ముందుకు వచ్చినట్లే ఉంటుంద'ని చేతికి ఇస్తారు.
వారు ఇచ్చిన ఫోన్ స్క్రీన్‌ను అశ్విన్ టచ్ చేస్తాడు. అప్పుడే అక్కడ గోడ చాటున ఉన్న కంగనా రనౌత్ వచ్చి వారి ముందు డ్యాన్స్ చేస్తుంది. అలా అందరూ కలిసి లైఫ్ స్మార్ట్ ఫోన్ కోసం డ్యాన్స్ చేస్తారు.