చెన్నై: భారత ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పైన శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్సీలో చాలా ఒత్తిడి ఉంటుందని, దానిని ధోనీ అర్థం చేసుకున్నట్లుగా మరెవరూ అర్థం చేసుకోలేరని కితాబిచ్చాడు. కెప్టెన్సీని ఎప్పుడు వదిలేయాలో అతనికి తెలుసన్నాడు.

ఐసీసీ ప్రపంచ కప్ ట్వంటీ 20లో భారత్ ఫేవరేట్ అని చెప్పాడు. టీ20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచే సత్తా భారత్‌కు ఉందని చెప్పాడు. ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే అధిగమించగలిగిన ధోనీ లాంటి కెప్టెన్ ఉండటం భారత క్రికెట్ జట్టుకు బాగా కలిసి వచ్చే అంశమన్నాడు.
ధోనీ సామర్థ్యాన్ని అంచనా వేయడం ఏ ఒక్కరి సాధ్యం కాదని సంగక్కర అన్నాడు. కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉంటాడని చెప్పాడు. అతను కెప్టెన్సీకి సిద్ధంగా ఉన్నాడన్నాడు. కాగా, త్వరలో ట్వంటీ 20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది.