For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ తెలివైన, ఉత్తమ కెప్టెన్: సచిన్ టెండూల్కర్ ప్రశంసలు

By Pratap
Sachin Tendulkar
ముంబై: తన 21 ఏళ్ల కెరీర్‌లో తాను ఆరుగురు కెప్టెన్ల కింద ఆడానని, వారిలో మహేంద్ర సింగ్ ధోనీ అత్యుత్తమ కెప్టెన్‌ అని, ధోనీ తెలివైన కెప్టెన్ అని భారత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ అన్నారు. ధోనీ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడని, తన అభిప్రాయాలను పంచుకుంటాడని ఆయన అన్నారు. ధోనీ బ్యాట్స్‌మెన్, బౌలర్లు, సీనియర్ ఆటగాళ్లతో విడివిడిగా మాట్లాడుతాడని ఆయన చెప్పారు. పైగా ఎల్లవేళలా ధోనీ కూల్‌గా ఉంటాడని, నిస్పృహకు గురి కాడని ఆయన అన్నారు. ధోనీని అద్భుతమైన కెప్టెన్‌గా సచిన్ అభివర్ణించాడు. ప్రపంచ కప్ గెలవాలనేది ప్రతి జట్టు సభ్యుడి కల అని, టైటిల్ గెలవడం ద్వారా తన కల నెరవేరిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రతి అటగాడు కూడా అంచనాలకు మించి ఆడాడని ఆయన అన్నారు. ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా భారత ప్రతిష్ట పెరిగిందని ఆయన అన్నారు.

కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్ కొనసాగాలని కోరుకుంటున్నానని, అయితే గ్యారీని మిస్ అవుతుండడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. నాకవుట్ దశలో తమ జట్టు పుంజుకుందని ఆయన చెప్పారు. తగిన సమయంలో జట్టు సభ్యులు పుంజుకున్నట్లు ఆయన తెలిపారు. సమిష్టి కృషి వల్లనే ప్రపంచ కప్ గెలిచామని ఆయన అన్నారు. ప్రపంచ కప్ టైటిల్‌తో తన ఆశ నెరవేరలేదని, వందో సెంచరీ సాధించకపోవడం లోటుగానే ఉందని ఆయన అన్నారు. జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు ప్రతి ఒక్కరూ భారత విజయానికి కృషి చేశారని ఆయన అన్నారు. తన జీవితంలో ప్రపంచ కప్ విజయం అది పెద్దదని ఆయన అన్నారు. తన కోసమే ప్రపంచ్ కప్‌ను గెలిచామని జట్టు సభ్యులు అనడం తనకు ఆనందాన్నిచ్చిందని ఆయన చెప్పుకున్నారు.

ఒత్తిడి, అంచనాలు ఎప్పటికీ ఉంటాయని, వ్యక్తిగతంగా మనం ఉత్తమంగా ఆడడం ముఖ్యమని, జట్టు విజయానికి తాము వ్యక్తిగతంగా అందించాల్సింది అందించామని, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగుల్లో రాణించామని ఆయన అన్నారు. విజయం సాధించిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్వేగానికి లోనయ్యానని ఆయన అన్నారు. ప్రపంచ కప్ పోటీల కోసం తాము చాలా కష్టపడ్డామని ఆయన చెప్పారు. తన సోదరులు సందీప్ పాటిల్ అభిమానులని, అప్పుడు తాను ఎగురుతూ దుముకుతూ ఆనందించేవాడినని, తాను బాల్ బాయ్‌గా ఉన్నప్పుడు డ్రెస్సింగ్ రూంలో అడుగు పెట్టానని, సునీల్ గవాస్కర్ తనకు వివిధ ఆటగాళ్లను పరిచయం చేశారని, అది మరిచిపోలేని ఘటన అని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+