ఒలింపిక్స్, భారత్ కోసం ప్రాణాలకి తెగించి: 'ధోనీ హెలికాప్టర్, దీపా జంబోజెట్'
రియో డీ జెనిరో: రియో ఒలింపిక్స్ 2016లో భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించారు. దీపా త్రిపుర అమ్మాయి. ఆమె ఎంచుకున్న ఆర్టిస్టికి జిమ్నాస్టిక్ చాలా ప్రమాదకరమైనది. ఓ విధంగా ప్రాణాలే పణంగా పెట్టే పోరాటం అని చెప్పవచ్చు.
జిమ్నాస్టిక్స్‌లో ఎక్కువ స్కోర్ సాధించేందుకు క్రీడాకారులు ప్రొడునొవా అనే విన్యాసం ప్రదర్శిస్తుంటారు. ఇది ప్రాణాలతో చెలగాటమే! దీప ప్రొడునొవా ప్రదర్శించడంలో ఏ మాత్రం తడబడ్డా ఆమె ప్రాణాలకెంతో ప్రమాదం.
ప్రొడునొవా ప్రదర్శించేటప్పుడు జిమ్నాస్ట్ వేగంగా పరిగెత్తి వాల్ట్‌పై చేతులతో బలంగా నొక్కి గాలిలోకి ఎగరవలసి ఉంటుంది. తల కిందికి వంచి మోకాళ్లను ఛాతికి ఆనించి చేతులతో పట్టుకొని మూడు చుట్లు తిరిగి మ్యాట్ పైకి చేరుతారు.

దీపా కర్మాకర్
క్రీడాకారుడు గాల్లో వేగంగా తిరిగేటప్పుడు ఒత్తిడి రెట్టింపవుతుంది. విన్యాసం పూర్తి కాకుండానే మెడతో నేలపై ల్యాండ్ అయితే అది చాలా ప్రమాదకరం. అందుకే దీపా కర్మాకర్ దేశం కోసం మృత్యువుతో యుద్ధం చేస్తున్నట్లే లెక్క అంటున్నారు.

దీపా కర్మాకర్
రష్యన్ అథ్లెట్ యెలీనా ప్రొడునొవా పేరును ఈ విన్యాసానికి పెట్టారు. 1999లో తొలిసారి ఆమె ఈ ఫీట్ ప్రదర్శించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం నలుగురు మాత్రమే దీనిని ప్రదర్శించారు. ఇప్పుడు దీప. రెండుసార్లు ప్రదర్శించిన రెండో అథ్లెట్ కూడా దీపానే.

దీపా కర్మాకర్
దీపా కర్మాకర్ రియో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించడంతో క్రికెట్ దిగ్గజం, రియోలో భారత సుహృద్భావ రాయబారి సచిన్ టెండుల్కర్ ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో ఆమెను కలిసి అభినందిచారు.
ఒలింపిక్స్, భారత్ కోసం ప్రాణాలకి తెగించి: 'ధోనీ హెలికాప్టర్, దీపా జంబోజెట్'
భారత్ నుంచి మొదటి సారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే కాక తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌కు అర్హత సాధించడం దేశానికి గర్వకారణమని సచిన్ కొనియాడారు. ధోనీ హెలికాప్టర్ షాట్లు కొడతాడని, దీపా జంబో జెట్ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications