'సగం కెప్టెన్ ధోనీనే, అతడు లేకపోతే కోహ్లీ మొరటుగా కనిపిస్తాడు'


హైదరాబాద్: చివరి రెండు వన్డేల నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎందుకు విశ్రాంతి ఇచ్చారో తనకు తెలియదని అతను లేని లోటు నాలుగో వన్డేలో స్పష్టంగా కనిపించిందని స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ అభిప్రాయపడ్డాడు. గత ఆదివారం మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ధోని లేకపోవడం వల్లే నాలుగో వన్డేలో ఓటమి
ధోని లేకపోవడం వల్లే నాలుగో వన్డేలో భారత్ భారీ స్కోర్‌ను కాపాడుకోలేక ఓటమిపాలైందని చెప్పాడు. ధోని లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనబడిందని, వికెట్ల వెనుకాల ఉండి ప్రశాంతంగా అతను రచించే వ్యూహాలు ఈ మ్యాచ్‌లో మిస్సయ్యాయని, కోహ్లీ కూడా ధోని సూచనలు లేక అయోమయానికి గురయ్యాడని పీటీఐకి ఇచ్చి ఇంటర్యూలో బేడీ చెప్పుకొచ్చాడు.

ధోనీకి ఎందుకు విశ్రాంతి కల్పించారో
"చివరి రెండు వన్డేలకు ధోనీకి ఎందుకు విశ్రాంతి కల్పించారో నాకైతే తెలీదు. కానీ అతడు లేని లోటు మొహాలీ వన్డేలో స్పష్టంగా కనిపించింది. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గానే కాదు.. వ్యూహకర్తగా కూడా అతను లేకపోవడం లోటే. ధోనీని సగం కెప్టెన్‌గా భావించవచ్చు. ప్రశాంతంగా ఉంటూనే ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తాడు" అని అన్నాడు.

ధోని జట్టులో ప్రశాంతత తెస్తాడు
"ధోని ఇప్పుడు కుర్రాడేమీ కాదు. అయినప్పటికీ జట్టుకు అతడి అవసరముంది. ధోని జట్టులో ప్రశాంతత తెస్తాడు. విరాట్ కోహ్లీకి అతడి మద్దతు కావాలి. ధోని లేకుండా కోహ్లి నిస్సహాయంగా కనిపిస్తున్నాడు. అది జట్టుకు మంచిది కాదు. ప్రపంచకప్ కోసం ఏడాది నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇక ప్రయోగాలు మాని ధోని లాంటి వాళ్లకు విశ్రాంతినివ్వకుండా ఆడించాల్సింది" అని బేడీ అన్నాడు.

ఐపీఎల్‌తో మరిన్ని సమస్యలు
"మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌తో మరిన్ని సమస్యలు రానున్నాయి. ఐపీఎల్‌లో ఏ ఆటగాడైన గాయపడవచ్చు. అలా అని వారు 100 శాతం ఆడుతారని కూడా మనం విశ్వసించలేం. ఇక కీపర్ పంత్‌కు సరైన గైడెన్స్ అందిస్తే రాటుదేలుతాడు" అని బేడీ తెలిపాడు. కుల్దీప్, చహల్‌లు కూడా సీజన్ ఫ్లేవర్‌లాంటి స్పిన్నర్లని, జడేజా, అశ్విన్‌లకు తుది జట్టులో అవకాశం వస్తుందని తాను భావిస్తున్నట్లు బేడీ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications