For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ధోని స్పిరిట్ ఆఫ్ క్రికెట్

By Nageswara Rao
Sachin Tendulkar-Mahendra Singh Dhoni
సోమవారం ఐసిసి ప్రకటించిన అవార్డుల లిస్ట్‌లో ఇండియన్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుని సొంతం చేసుకున్నారు. ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2010 అవార్డుని ప్రకటించడం జరిగింది. ధోనికి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు ఇవ్వడానికి గల కారణం జులైలో ట్రెంట్ బ్రిడ్జిలో ఇంగ్లాండ్‌‌తో జరిగిన రెండవ టెస్టుమ్యాచ్‌లో ఇయాన్ బెల్ రన్ అవుట్ అయిన విషయంలో కెప్టెన్ ధోని సమయస్పూర్తితో స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌ని చూపించడంతో ఈ అవార్డుని ధోనికి ప్రకటించడం జరిగిందని తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఈ అవార్డుల కార్యక్రమం ప్రపంచకప్ విజేత జట్టు ఇండియా లేకుండా జరిగింది. సోమవారం అర్ధరాత్రి లండన్‌లోని ఓ హోటల్‌లో ఈ ఫంక్షన్ వైభవంగా ప్రారంభమైంది.అయితే భారత క్రికెటర్లు ఈ కార్యక్రమానికి రాలేదు. సోమవారం మధ్యాహ్నం వరకూ భారత ఆటగాళ్లకు ఆహ్వానం అందలేదని సమాచారం. దీంతో ఆగ్రహించిన క్రికెటర్లు, బోర్డు పెద్దలు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. మొత్తం జట్టంతా లండన్‌లోనే ఫంక్షన్ వేదికకు కూతవేటు దూరంలో ఉంది. 'మాకు ఎక్కువ సమయం లేదు. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోతున్నాం" అని జట్టు మేనేజర్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్ చెబుతున్నా... అసలు కారణం మాత్రం అలకే. ఈ అవార్డుల్లో నాలుగు విభాగాల్లో భారత ఆటగాళ్లు ఉన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+