న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్-కోచ్ కాంబినేషన్ ఎవరిదో తెలుసా?

Dhoni, Fleming best captain-coach combination in world: Watson

హైదరాబాద్: ధోని-ఫ్లెమింగ్‌లది ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌-కోచ్‌ కాంబినేషన్‌ అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ తెలిపాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని ఉండగా, కోచ్‌గా ఫ్లెమింగ్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

<strong>కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌</strong>కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌

షేన్ వాట్సన్ సైతం అదే జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వాట్సన్ మాట్లాడుతూ తాను ఇప్పటివరకూ చూసిన కెప్టెన్‌-కోచ్‌ కాంబినేషన్‌లో ధోని-ఫ్లెమింగ్‌లదే అగ్రస్థామంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని ముందుండి నడిపించడంతో పాటు ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీయడంలో వీరిది కీలక పాత్ర అని అన్నాడు.

ఐపీఎల్‌ ఆరంభం నుంచీ సీఎస్‌కే ఒక సక్సెస్‌ఫుల్‌ జట్టుగా ఉందంటే అందుకు కారణం ధోని కెప్టెన్సీతో పాటు ఫ్లెమింగ్‌ కోచింగే కారణమని చెప్పుకొచ్చాడు. వాట్సన్ మాట్లాడుతూ "చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)తో నా అనుభవం చాలా ప్రత్యేకమైనది.. నేను ఆడిన అత్యధిక లీగ్‌ మ్యాచ్‌లు సీఎస్‌కే తరఫునే ఆడాను" అని అన్నాడు.

<strong>రోహిత్ శర్మతో కలిసి బుమ్రా, కోహ్లీని ఇమిటేట్ చేసిన జడేజా(వీడియో)</strong>రోహిత్ శర్మతో కలిసి బుమ్రా, కోహ్లీని ఇమిటేట్ చేసిన జడేజా(వీడియో)

"ఇప్పటివరకూ సీఎస్‌కే కచ్చితమైన మార్గంలో విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతుంది. ఇందుకు ఆ జట్టుకు ఉన్న సరైన ప్రణాళికే కారణం. ఇందులో ధోని-ఫ్లెమింగ్‌ల పాత్రే అమోఘం. వరల్డ్‌లోనే ఆ ఇద్దరిదీ అత్యుత్తమ కెప్టెన్‌-కోచ్‌ కాంబినేషన్‌ అని నేను బలంగా నమ్ముతాను" అని షేన్ వాట్సన్‌ తెలిపాడు.

Story first published: Friday, August 16, 2019, 7:16 [IST]
Other articles published on Aug 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X