Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ ఫ్యాన్స్ శాపాలు త‌గిలాయా? కివీస్‌కు క‌ప్‌ను దూరం చేసిన గ‌ప్టిల్ ర‌నౌట్‌!

ICC Cricket World Cup 2019 Final : ENG v NZ:Dhoni Fans Curse Became True As Guptill Run Out !
Dhoni fans curse became true? as Guptill run out in CWC Final Match reason to Kiwis lose the Cup

లండ‌న్‌: నిజ‌మే! టీమిండియా వికెట్ కీప‌ర్‌, మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్రసింగ్ ధోనీ అభిమానుల శాపాలు న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్టుకు త‌గిలిన‌ట్టే కనిపిస్తున్నాయి. ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌క్కువ స్కోరు చేసి కూడా.. ప్ర‌త్య‌ర్థిని క‌ట్ట‌డి చేసి.. మ్యాచ్‌ను సూప‌ర్ ఓవ‌ర్ వ‌ర‌కూ తీసుకెళ్లింది న్యూజిలాండ్‌. మ్యాచ్‌లో స్కోర్ టై, సూప‌ర్ ఓవ‌రూ టై. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా ఆవిర్భ‌వించింది ఇంగ్లండ్‌. దీనికి ప్ర‌ధాన కార‌ణం బౌండ‌రీల‌ను అధికంగా బాదేయ‌డం. ఇదెలా ఉన్న‌ప్ప‌టికీ.. ఒకే ఒక్క ర‌నౌట్ న్యూజిలాండ్ జ‌ట్టు నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది.

 ఒక్క ర‌నౌట్‌.. క‌ప్‌కు దూరం!

ఒక్క ర‌నౌట్‌.. క‌ప్‌కు దూరం!

దానికి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. న్యూజిలాండ్ పోగొట్టుకున్న‌ది ఒక్క మ్యాచ్‌ను మాత్ర‌మే కాదు.. విశ్వ‌విజేత‌గా ఆవిర్భ‌వించే అద్భుత అవ‌కాశాన్ని కూడా.సూప‌ర్ ఓవ‌ర్‌లో ర‌నౌట్ అయింది మార్టిన్ గ‌ప్టిల్‌. ఒక బంతికి రెండు ప‌రుగులు అవ‌స‌ర‌మైన ద‌శ అది. జోఫ్రా ఆర్చ‌ర్ వేసిన సూప‌ర్ ఓవ‌ర్ ఆరోబంతికి రెండు ప‌రుగులు చేస్తే- న్యూజిలాండ్ క్రికెట్ జ‌గ‌జ్జేత‌గా మారుతుంది. తొలిసారి క‌ప్‌ను అందుకున్న ఘ‌నత‌ను సాధిస్తుంది. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న‌ది మార్టిన్ గ‌ప్టిల్‌. జోఫ్రా ఆర్చ‌ర్ వేసిన బంతిని మిడాన్ దిశ‌గా త‌ర‌లించాడు గ‌ప్టిల్‌. ఒక ర‌న్ తీశాడు. అక్క‌డితో సూప‌ర్ ఓవ‌ర్ టైగా మారింది. ఇంగ్లండ్‌తో స‌మానంగా 15 పరుగులను సాధించింది న్యూజిలాండ్‌.

చివ‌రి వర‌కూ.. ఊపిరి బిగ‌బ‌ట్టి!

చివ‌రి వర‌కూ.. ఊపిరి బిగ‌బ‌ట్టి!

సూప‌ర్ ఓవ‌ర్ టై అయిన‌ప్ప‌టికీ.. తాము ఓడిపోతామ‌ని తెలుసు గ‌ప్టిల్‌కు. అందుకే- ప‌రుగు రాద‌ని తెలిసిన‌ప్ప‌టికీ.. ఊపిరి బిగ‌బ‌ట్టుకుని లేని ర‌న్ కోసం స్ట్రైక‌ర్ ఎండ్ వైపు శ‌ర‌వేగంగా ప‌రుగు తీశాడు. అది పూర్త‌యి ఉంటే ఇంగ్లండ్ ఆశ నిరాశే అయ్యుండేది. ఆ ప‌రుగు పూర్తి కాలేదు. మిడాన్‌లో ఫీల్డింగ్‌లో ఉన్నాడు జేస‌న్ రాయ్‌. బంతిని అందుకున్నాడు. గురి త‌ప్ప‌లేదు. మెరుపుకంటే వేగంగా స్పందించాడు. కీప‌ర్ జోస్ బట్ల‌ర్ వైపు విసిరాడు. క‌ప్‌ను తెచ్చిపెట్టే త్రో అది. 44 సంవ‌త్స‌రాల త‌మ దేశ అభిమానుల క‌ల‌ను సాకారం చేసే త్రో అది. బ‌ట్ల‌ర్ కూడా ఎలాంటి త‌ప్పూ చేయ‌లేదు. బంతి అందుకున్న క్షణం వ్య‌వ‌ధిలో వికెట్ల‌ను గిరాటేసేశాడు. అప్ప‌టికి క్రీజులోకి చేరుకోలేక‌పోయాడు మార్టిన్ గ‌ప్టిల్‌. ఓ గ‌జం దూరంలో ఉన్నాడు. బ్యాట్‌తో స‌హా డైవ్ చేసిన‌ప్ప‌టికీ.. స‌మ‌యానికి క్రీజును అందుకోలేక‌పోయ‌డు. ఫ‌లితం- మ‌న‌కు తెలిసిందే.

ధోనీ శాపాలు త‌గిలిన‌ట్టే ఉన్నాయి..

న్యూజిలాండ్‌తో మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ అచ్చంగా ఇలాగే ర‌నౌట్ అయ్యాడు. ఈ ర‌నౌట్‌కు కార‌కుడు- మార్టిన్ గ‌ప్టిల్‌!. 10 బంతుల్లో 25 ప‌రుగులు చేయాల్సిన ద‌శ‌లో మార్టిన్ గ‌ప్టిల్ అద్భుతంగా విసిరిన బంతి.. నేరుగా వికెట్ల‌ను త‌గిలింది. అప్ప‌టికి ధోనీ క్రీజుకు ఓ అయిదు అంగుళాల దూరంలోనే ఉన్నాడు. గ‌ప్టిల్ విసిరిన బంతి స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్ల‌కు త‌గ‌ల‌డం, బెయిల్స్ ఎగిరి పోవ‌డం.. ఫ‌లితంగా ధోనీ ర‌నౌట్ నిరాశ‌గా పెవిలియ‌న్ దారి ప‌ట్ట‌డం చ‌క‌చ‌కా సాగిపోయాయి. ఆ స‌మ‌యంలో భార‌త క్రికెట్ ప్రేమికులు ప‌డిన బాధ వ‌ర్ణ‌నాతీతం. ప్ర‌త్యేకించి- ధోనీ అభిమానులు.

గ‌ప్టిల్‌కు ఎన్ని శాపాలు త‌గిలాయో

గ‌ప్టిల్‌కు ఎన్ని శాపాలు త‌గిలాయో

ఆ స‌మ‌యంలో బ‌హుశా మార్టిన్ గ‌ప్టిల్‌కు శ‌పించి ఉండొచ్చు. ఆ మ్యాచ్‌లో గ‌ప్టిల్ వ‌ల్ల ధోనీ ర‌నౌట్ కావ‌డం భార‌త్‌కు ఫైన‌ల్ దారుల‌ను మూసేయ‌గా.. ఈ మ్యాచ్‌లో జేస‌న్ రాయ్ వ‌ల్ల మార్టిన్ గ‌ప్టిల్ ర‌నౌట్ కావ‌డం.. న్యూజిలాండ్‌కు ప్ర‌పంచ‌క‌ప్‌ను అంద‌కుండా చేసింది. 10 బంతుల్లో 25 ప‌రుగులు చేయాల్సిన ద‌శ‌లో గ‌ప్టిల్ వ‌ల్ల ధోనీ ర‌నౌట్ కావ‌డం టీమిండియాకు ఫైన‌ల్ చేర‌కుండా చేసింది. అదే త‌ర‌హాలో గ‌ప్టిల్ కూడా లేని ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించి- ర‌నౌట్ అయ్యాడు. ఈ నేప‌థ్యంలో- ధోనీ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ధోనీ ర‌నౌట్‌, గ‌ప్టిల్ ర‌నౌట్‌ను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చి.. న్యాయం జ‌రిగిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

1
43691
Story first published: Monday, July 15, 2019, 9:37 [IST]
Other articles published on Jul 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+