ముంబై: భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ కొత్త కొత్త హెయిల్ స్టయిల్స్‌తో అప్పుడప్పుడు దర్శనమిస్తుంటారు. తాజాగా తన ఆస్ట్రేలియా పర్యటనకు మరో కొత్త హెయిల్ స్టయిల్‌తో వెళ్తున్నారు. కొత్త హెయిర్ స్టైల్ వస్తే దానిని అనుసరించే వారిలో ధోనీ ముందుంటారు.
మోహాక్ కటింగ్‌ను ధోనీ ఇక్కడ పరిచయం చేశారు. ఇప్పుడు మరో హెయిర్ స్టైల్ మార్చాడు. స్పిక్-అండ్-స్పాన్ లుక్కుతో మీడియా కంటబడ్డాడు. తల మీద మాడుపై మినహా మరెక్కడా జుట్టు కనిపించదు. కాగా, ఆస్ట్రేలియాతో తొలి టెస్టు డిసెంబర్ 9న ప్రారంభం కానుంది. ఆ సమయానికల్లా ధోనీ జట్టుతో కలిసే అవకాశాలున్నాయి.
ఆస్ట్రేలియాతో మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల బోర్డర్ - గవాస్కర్ క్రికెట్ సిరీస్‌లో భారత జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం కారణంగా ప్రస్తుతం స్వదేశంలోనే ఉన్న ధోనీ ఈ నెల 9వ తేదీన తేదీన అడిలైడ్‌లో మొదలయ్యే తొలి టెస్టుకు ముందే భారత జట్టును చేరుకోవచ్చని భావిస్తున్నారు.

ఇంతకుముందు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 4వ తేదీన బ్రిస్బేన్‌లోనే ఈ సిరీస్ ప్రారంభం కావలసి ఉండటంతో చేతి గాయంతో బాధపడుతున్న ధోనీని తొలి టెస్టుకు దూరంగా ఉంచారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ దుర్మరణం కారణంగా ఈ సిరీస్ షెడ్యూలును మార్చి అడిలైడ్‌లో ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తొలి టెస్టును నిర్వహిస్తున్నారు.
తొలి టెస్టు: డిసెంబర్ 9 నుంచి 13 వరకు (అడిలైడ్)
రెండవ టెస్టు: డిసెంబర్ 17 నుంచి 21 వరకు (బ్రిస్‌బేన్)
మూడో టెస్టు: డిసెంబర్ 26 నుంచి 30 వరకు (మెల్‌బోర్న్)
నాల్గవ టెస్టు: జనవరి 6 నుంచి 10 వరకు (సిడ్నీ)