
సీఎస్కే క్లారిటీ
ఈ వార్తలపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ అధికార వర్గాలు స్పందించాయి. ధోని ఈ సారి కెప్టెన్‌గా వ్యవహరించడం లేదనే వార్తలను కొట్టి పారేశాయి. ఈ సారి కూడా మహేంద్రసింగ్ ధోనినే తమ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని స్పష్టం చేశాయి. నిజానికి ఇప్పటి వరకు తమ జట్టుకు కెప్టెన్‌ను మార్చాలనే అంశంపై చర్చ జరగలేదని తెలిపాయి. ప్రస్తుతానికి ధోనినే తమ కెప్టెన్ అని తేల్చి చెప్పాయి. కెప్టెన్సీ మార్పు జరగాల్సిన సమయం వచ్చినప్పుడు అదే జరగుతుందని చెన్నై వర్గాలు తెలిపాయి. చెన్నై సూపర్ కింగ్స్ కోసం ధోని ఎంతో చేశాడని చెప్పిన సీఎస్కే వర్గాలు.. ధోని తాను వద్దనుకున్నప్పుడే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని వెల్లడించాయి. అది కూడా ధోని నిర్ణయం ప్రకారమే జరుగుతుందని తెలిపాయి.

మరో టైటిల్ అందిస్తాడు
ప్రస్తుతం మహేంద్రసింగ్ ధోని ఫిట్‌గా ఉన్నాడని, చెన్నైసూపర్ కింగ్స్‌కు మరో టైటిల్ అందిస్తాడనే నమ్మకం తమకు ఉందని ఆ జట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ధోని ఎవరి అంచనాలకు అందడని, రిటెన్షన్ జాబితాలో రవీంద్ర జడేజా కోసం తన ప్రాధాన్యాన్ని తగ్గించుకున్నాడని చెప్పాయి. సీఎస్కేకు ఏ సమయంలో ఏ అవసరం వచ్చిన ముందుంటాడని తెలిపాయి. ఇక ప్రస్తుతం తమ దృష్టి అంతా ఫిబ్రవరి 12, 13న జరగనున్న మెగా వేలంపైనే ఉందని చెన్నైసూపర్ కింగ్స్ అధికార వర్గాలు వెల్లడించాయి.

వేలంపై ధోని చర్చలు
మహేంద్రసింగ్ ధోని నేడు చెన్నై చేరుకుని త్వరలో జరగనున్న మెగా వేలం గురించి చెన్నైసూపర్ కింగ్స్ జట్టు మేనేజ్‌మెంట్‌తో చర్చిస్తున్నాడు. వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై, ఏ ఏ ఆటగాళ్లను కొనుగోలు చేయాలనే అంశాలపై తీవ్రంగా చర్చిస్తున్నాడు. కాగా చెన్నైసూపర్ కింగ్స్ జట్టు ఈ సారి తమ రిటెన్షన్ జాబితాలో నలుగురికి చోటు ఇచ్చింది. ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లు కాగా, మరొకరు విదేశాలకు చెందిన వారు ఉన్నారు. ఈ రిటెన్షన్ జాబితాలో సూపర్ కింగ్స్ అత్యధికంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు 16 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఆ తర్వాత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 12 కోట్ల రూపాయలు, ఇంగ్లండ్‌కు చెందిన మొయిన్ అలీకి 8 కోట్ల రూపాయలు, రుతురాజ్ గైక్వాడ్‌కు 6 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది.


Click it and Unblock the Notifications












