Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిటైర్మెంట్: ధోని వెనుక మాజీలు, అనుహ్య మద్దతు

న్యూఢిల్లీ: భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించిన అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకరు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరిస్‌లో 3-2తేడాతో విజయం సాధించి భారత్‌కు మరో అద్భుత విజయాన్ని అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నేపథ్యంలో టీమిండియాకు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా కొనసాగుతున్న ధోని త్వరలో రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని, వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతోంది.

అయితే 2019లో జరిగే వన్డే వరల్డ్ కప్ వరకు ధోని కొనసాగాలని మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు. ఈ అంశంపై టీమిండియా మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా స్పందించాడు.

Dhoni to consider retirement after Champions Trophy? Ex-cricketers back skipper to continue

'వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి ధోని వయసు 38 ఏళ్లు. ఈ రోజుల్లో క్రికెట్ ఆడేందుకు ఇదేమంత ఎక్కువ వయసు కాదు. పాక్ ఆటగాళ్లు యూనిస్ ఖాన్, మిస్బా వుల్ హక్ 40 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్నారు. అయితే 2019 వరకు ఫిట్‌నెస్ కాపాడుకుంటే ధోని కూడా కొనసాగవచ్చు' అని అన్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరిస్ తర్వాత ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని వైదొలగాల్సిన అవసరం లేదన్నాడు. ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరిస్ కోసం ధోని రెండు నెలలు రెస్ట్ తీసుకుని ఫ్రెష్‌గా జట్టులోకి రావొచ్చని సూచించాడు. ధోని గొప్ప ఆటగాడని, 2019 వరకు ఆడాలని కోరాడు.

నెహ్రా వ్యాఖ్యలకు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి మద్దతు తెలిపాడు. 'కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లా ధోని కూడా గొప్ప ఆటగాడు. 2019 వరకు అతడు ఆడాలి. అతడి లాంటి ఆటగాడు సమీప భవిష్యత్తులో లభించడం కష్టం. తనదైన ఆటతీరుతో సమకాలిన క్రికెట్‌లో ధోని చెరగని ముద్ర వేశాడ'ని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Dhoni to consider retirement after Champions Trophy? Ex-cricketers back skipper to continue

మరో మాజీ ఆటగాడు, మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్‌లో ఫిట్‌నెస్ చాలా కీలకమని, ఫిట్ గా ఉంటే 2019 వరకు ధోని కొనసాగుతాడని అన్నాడు. భారత్‌కు ధోని అవసరమని, అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని అనవసరంగా తప్పుకోడని తన అభిప్రాయంగా చెప్పాడు.

కాగా, వచ్చే ఏడాది జూన్‌లో లండన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ధోని రిటైర్ అవుతాడా? లేదా అనే విషయం ఇంగ్లాండ్‌తో రాబోయే రోజుల్లో జరిగే వన్డే సిరిస్ నిర్ణయిస్తుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+