పిచ్‌ని పరిశీలించిన ధోని: కోహ్లీకి సూచన చేస్తాడా?
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య నవంబర్ 16 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పరిశీలించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
రెండేళ్లు క్రితమే టెస్టు క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయినా సరే ధోని ఈడెన్ గార్డెన్స్‌కి ఎందుకొచ్చాడో తెలుసా? బెంగాలీ దర్శక నిర్మాత అరిందమ్ సిల్ నేతృత్వంలో ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొనేందుకు క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోనీలు గురువారం ఈడెన్ గార్డెన్‌కు వచ్చారు.

యాడ్ ఫిల్మ్ కోసం ఈడెన్‌కి ధోని
ఈడెన్‌లో ఈ యాడ్ ఫిల్మ్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనుమతి ఇచ్చారు. ఈ షూటింగ్ విరామ సమయంలో ధోనీ పిచ్ వద్దకు వెళ్లాడు. వేళ్లతో తడిమాడు. పచ్చికను, నెర్రెలను పరిశీలించాడు. పిచ్‌ను ఎలా సన్నద్ధం చేస్తున్నారో క్యూరేటర్‌ను అడిగి తెలుసుకున్నాడు.

క్యూరేటర్ ముఖర్జీకి ప్రశంస
అనంతరం పిచ్‌ను సిద్ధం చేస్తున్న విధానం బాగుందని క్యూరేటర్ ముఖర్జీని ప్రశంసించాడు. ఇదిలా ఉంటే షూటింగ్‌లో భాగంగా కపిల్ బౌలింగ్ చేయగా, ధోని బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత ధోని కూడా కపిల్ దేవ్‌కు బౌలింగ్ చేయడం విశేషం. ఈ యాడ్ షూటింగ్‌ని చూసేందుకు పెద్ద ఎత్తున చిన్నారులు ఈడెన్ గార్డెన్స్‌కు తరలివచ్చారు.

ధోని సహజ నటుడు
‘షూటింగ్ సమయంలో తాను బౌలింగ్ చేయలేనని, అలసిపోతానని ముందుగా చెప్పినా ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాత కపిల్ ఆగలేదు. పెద్ద సంఖ్యలో బంతులు విసరడంతో పాటు బ్యాటింగ్‌లో కూడా షాట్లు కొట్టారు. ఇక ధోని అయితే సహజ నటుడు. ఒక్కసారి కూడా నేను రీటేక్ చేయాల్సిన అవసరమే రాలేదు' అని ఈ యాడ్‌ని రూపొందించన అరిందమ్ సిల్ వెల్లడించారు.

మూడో టీ20 ముగిసిన తర్వాత ధోనీ నేరుగా
30 నిమిషాల నిడివి కలిగిన ఈ యాడ్ షూటింగ్‌లో కపిల్ దేవ్, ధోనిలతో పాటు చిన్నారులు కూడా కలిసి నటించారు. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో మూడో టీ20 ముగిసిన తర్వాత ధోనీ నేరుగా యాడ్ కోసం కోల్‌కతాకు చేరుకున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టు నవంబర్ 16 (గురువారం)న ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications