అగ్రస్థానంలోనే కోహ్లీ, బుమ్రా: మరింత మెరుగైన ధోని ర్యాంకు

హైదరాబాద్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గడ్డపై చారిత్రక విజయాలను నమోదు చేసిన టీమిండియా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతోంది. సోమవారం ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్‌లో126 పాయింట్లతో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉండగా... భారత్ 122 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు రెండో స్థానంలో ఉన్న టీమిండియా ఆ సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్నప్పటికీ రెండో స్థానంతోనే సరిపెట్టుకుంది.

వ్యత్యాసం నాలుగు పాయింట్లే
అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్‌కు టీమిండియా మధ్య వ్యత్యాసం కేవలం నాలుగు పాయింట్లే. భారత్‌తో సిరీస్‌లో ఘోర ఓటమి పాలైన న్యూజిలాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. మరోవైపు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు.

887 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ
బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ 887 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా, బౌలింగ్ విభాగంలో బూమ్రా 808 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వరుస హాఫ్ సెంచరీలతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ధోని మూడు స్థానాలను మెరుగుపరుచుకుని 17వ స్థానానికి చేరాడు. బౌలర్ల జాబితాలో టీమిండియా చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ 4,5 స్థానాల్లో నిలిచారు.

టీమ్ ర్యాంకింగ్స్..:
1. ఇంగ్లండ్(126)
2. ఇండియా(122+1)
3. సౌతాఫ్రికా(111)
4. న్యూజిలాండ్(111-1)
5. పాకిస్థాన్(102)
6.ఆస్ట్రేలియా(100)
7.బంగ్లాదేశ్(93)
8.శ్రీలంక(78)
9.వెస్టిండీస్( 72)
10. ఆఫ్ఘనిస్థాన్(67)

బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్..:
1.విరాట్ కోహ్లి(887), ఇండియా
2. రోహిత్ శర్మ(854), ఇండియా
3. రాస్ టేలర్(821), న్యూజిలాండ్
4.జోయ్ రూట్(807), ఇంగ్లండ్,
5. బాబర్ ఆజామ్ (801), పాకిస్థాన్
6. డుప్లెసిస్(791), సౌతాఫ్రికా
7. షాయ్ హప్(780), వెస్టిండీస్
8. డికాక్(758), సౌతాఫ్రికా
9. ఫకార్ జమాన్(755), పాకిస్థాన్
10. శిఖర్ ధావన్(744), ఇండియా

బౌలర్ల ర్యాంకింగ్స్..:
1. జస్ప్రీత్ బుమ్రా(808), ఇండియా
2. రషీద్ ఖాన్(788), ఆఫ్ఘనిస్థాన్
3. ట్రెంట్ బౌల్డ్(732), న్యూజిలాండ్
4. కుల్దీప్ యాదవ్(719), ఇండియా
5. యజువేంద్ర చాహల్(709), ఇండియా
6. ముస్తాఫిజుల్ రెహ్మాన్(695), బంగ్లాదేశ్
7. కసిగో రబాడ(688), సౌతాఫ్రికా
8. ఆడిల్ రషీద్(683), ఇంగ్లండ్
9. ముజీబ్ జర్దాన్(679), ఆఫ్ఘనిస్థాన్
10. జోష్ హేజిల్‌వుడ్(665), ఆస్ట్రేలియా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications