హెచ్‌ఐఎల్: రాంచి జట్టుని కొన్న కెప్టెన్ ధోని(ఫోటోలు)
హైదరాబాద్: భారత్ కెప్టెన్‌గా క్రికెట్లో అత్యున్నత స్ధాయి విజయాలను అందుకున్న మహేంద్ర సింగ్ ధోని... క్రీడాకారుడిగా ప్రోత్సహించడమే తన లక్ష్యమంటూ హాకీ ఇండియా లీగ్ అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. మోటార్ స్పోర్ట్స్‌లో మహీ రేసింగ్, ఫుట్‌బాల్ లీగ్‌లో చెన్నయన్ జట్లను కొనుగోలు చేసిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పుడు హాకీ లీగ్‌లోనూ ఒక జట్టును సొంతం చేసుకున్నాడు.
హెచ్‌ఐఎల్‌లో ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్ విజార్డ్స్ పేరుతో ఒక జట్టును కలిగి ఉన్న సహారా ఇండియా పరివార్‌తో కలిసి రాంచీ ఫ్రాంచైజీకి యజమానిగా వ్యవహరించనున్నాడు. గత రెండు సీజన్లలోనూ అద్భుతంగా రాణించిన 'రాంచీ రైనోస్ 'ఫ్రాంచైజీ ఓనర్లకు, లీగ్ నిర్వాహకులకు మధ్య విభేదాలు తలెత్తడంతో జట్టును అమ్మాలని నిర్ణయించగా, సహారా ఇండియా పరివార్‌తో కలిసి హీరో హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో రాంచి ఫ్రాంజైజీని ధోని కొనుగోలు చేశాడు.
'రాంచీ రేస్' పేరుతో వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో జరిగే మూడో సీజన్‌లో బరిలోకి దించనున్నాడు. శనివారం ఇక్కడ ఒక హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో జట్టు లోగోనూ, జెర్సీని విడుదల చేశాడు.
హాకీ ప్రాంఛైజీని కొనుగోలు చేయడంపై ధోని మాట్లాడుతూ క్రీడాకారుడిగా జాతీయ క్రీడను ప్రోత్సహించాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు. "రాంచి జట్టును కొనుగోలు చేయడం ద్వారా హాకీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఇది నాకు ప్రత్యేకమైన రోజు" అని అన్నాడు.
"క్రికెట్ ఆడటం నా తొలి ప్రాధాన్యత. క్రీడాకారుడిగా క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత నాపై ఉంది. రాంచిలో పుట్టి పెరిగాను. అందుకే మరో ఆలోచన చేయకుండా జట్టును కొనుగోలు చేశాను. నా ప్రధాన లక్ష్యం హాకీ అభివృద్ది. మూలాల నుంచి ఆటను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. హాకీ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు రాంచి రేస్ కృషి చేస్తుంది" అని ధోని చెప్పాడు.

హెచ్‌ఐఎల్: రాంచి జట్టుని కొన్న కెప్టెన్ ధోని
భారత్ కెప్టెన్‌గా క్రికెట్లో అత్యున్నత స్ధాయి విజయాలను అందుకున్న మహేంద్ర సింగ్ ధోని... క్రీడాకారుడిగా ప్రోత్సహించడమే తన లక్ష్యమంటూ హాకీ ఇండియా లీగ్ అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. మోటార్ స్పోర్ట్స్‌లో మహీ రేసింగ్, ఫుట్‌బాల్ లీగ్‌లో చెన్నయన్ జట్లను కొనుగోలు చేసిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పుడు హాకీ లీగ్‌లోనూ ఒక జట్టును సొంతం చేసుకున్నాడు.

హెచ్‌ఐఎల్: రాంచి జట్టుని కొన్న కెప్టెన్ ధోని
గత రెండు సీజన్లలోనూ అద్భుతంగా రాణించిన 'రాంచీ రైనోస్ 'ఫ్రాంచైజీ ఓనర్లకు, లీగ్ నిర్వాహకులకు మధ్య విభేదాలు తలెత్తడంతో జట్టును అమ్మాలని నిర్ణయించగా, సహారా ఇండియా పరివార్‌తో కలిసి హీరో హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో రాంచి ఫ్రాంజైజీని ధోని కొనుగోలు చేశాడు.

హెచ్‌ఐఎల్: రాంచి జట్టుని కొన్న కెప్టెన్ ధోని
‘రాంచీ రేస్' పేరుతో వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో జరిగే మూడో సీజన్‌లో బరిలోకి దించనున్నాడు. శనివారం ఇక్కడ ఒక హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో జట్టు లోగోనూ, జెర్సీని విడుదల చేశాడు.

హెచ్‌ఐఎల్: రాంచి జట్టుని కొన్న కెప్టెన్ ధోని
"క్రికెట్ ఆడటం నా తొలి ప్రాధాన్యత. క్రీడాకారుడిగా క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత నాపై ఉంది. రాంచిలో పుట్టి పెరిగాను. అందుకే మరో ఆలోచన చేయకుండా జట్టును కొనుగోలు చేశాను. నా ప్రధాన లక్ష్యం హాకీ అభివృద్ది. మూలాల నుంచి ఆటను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. హాకీ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు రాంచి రేస్ కృషి చేస్తుంది" అని ధోని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications